
శ్రీశైల దేవస్థానం: శ్రీశైల దేవస్థానం నిర్వహిస్తున్న ధర్మపథంలో భాగంగా (నిత్య కళారాధన కార్యక్రమం ) బుధవారం లహరి శ్రీ నృత్య నికేతన్ హైదరాబాద్ సంప్రదాయ నృత్య ప్రదర్శన కార్యక్రమం సమర్పించారు.
ఆలయ దక్షిణ మాడవీధిలోని నిత్యకళారాధన వద్ద సాయంకాలం గం.6:30 ని||ల నుండి సంప్రదాయ నృత్య ప్రదర్శన కార్యక్రమం జరిగింది.
కార్యక్రమం లో గణపతి స్తుతి, శివ వైభవం, శివాష్టకం, జేం జేం తనన, సరస్వతి స్తుతి, శివతాండవం, తదితర గీతాలకు పి. ఝాన్సీరామ్, సాయినిత్య, తాత్విక, డి. చంద్రిక, టి.ఎం. కస్తూరి మనస్విత, కనకహర్షిని, చతురిక, హర్షిత, పునీత, ఆదితి తదితరులు నృత్య ప్రదర్శన చేసారు.
గురువారం సాంస్కృతిక కార్యక్రమాలు:
గురువారం శ్రీమతి పి. ప్రమీల రాణి, విజయవాడ బృందం భజన కార్యక్రమం వుంటుంది.
*Jwala Veerabhadra swamy Puuja, Sakthi Ganapathi Abhishekam performed by Archaka swaamulu.