శ్రీమతి దుర్గ రాజేశ్వరి,ఈశ్వర్ కూచిపూడి క్షేత్రం, హైదరాబాద్ సంప్రదాయ నృత్య ప్రదర్శన
శ్రీశైల దేవస్థానం:శ్రీశైల దేవస్థానం నిర్వహిస్తున్న “నిత్యకళారాధన” (నివేదన) కార్యక్రమంలో భాగంగా ఈ రోజు (30.10.2021) న శ్రీమతి దుర్గ రాజేశ్వరి,ఈశ్వర్ కూచిపూడి క్షేత్రం, హైదరాబాద్ వారి బృందంచే సంప్రదాయ నృత్య ప్రదర్శన కార్యక్రమం జరిగింది.
ఆలయ దక్షిణ మాడవీధిలోని నిత్యకళారాధన వద్ద ఈ రోజు సాయంకాలం గం.6:30 ని||ల నుండి ఈ సంప్రదాయ నృత్య ప్రదర్శన కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమం లో ఏకదంతాయ, ఓం….శివోహం, అర్ధనారీశ్వరం, గిరిజాకల్యాణం, కాలభైరవాష్టకం, ప్రభుం ప్రాణదానం తదితర గీతాలకు జి. శ్రీరామ్, కె. హాసిని, కె. సురేఖ, కె. రోష్విత, పి. తేజశ్విని, ఆర్. మోక్షిత్, సి.హెచ్.అభిరందన, శివరుత్విక్,జి. సాహిత్య, జె. నాగ మనస్వినీ, బి. హారిక, జి. జన్విక, తదితరులు నృత్యప్రదర్శన సమర్పించారు.
ఈ కార్యక్రమంలో కేరళ సంప్రదాయం పై కథాకళి నృత్యం కూడా జరిగింది.
కాగా ఈ నిత్య కళారాధనలో ప్రతి రోజూ హరికథ, బుర్రకథ, సంప్రదాయ నృత్యం, వాయిద్య సంగీతం, భక్తిరంజని లాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు.
శ్రీ స్వామిఅమ్మవార్లకు ఆయా కైంకర్యాలన్నీ పరిపూర్ణంగా జరగాలని, ప్రాచీన సంప్రదాయ కళల పరిరక్షణలో భాగంగా ఈ నిత్య కళారాధన (నివేదన) కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
ఈ కార్యక్రమాలలో ముఖ్యంగా స్థానిక కళాకారులకు, జిల్లాలోని కళాకారులకు ప్రాధాన్యం ఇస్తున్నారు.
రేపటి నిత్య కళారాధన:
.రేపు (31.10.2021) న కె.సి. అశోక్ కుమార్ బృందం, ఖమ్మం సంప్రదాయ నృత్య ప్రదర్శన కార్యక్రమం వుంటుంది.
* N.Nageswaramma , Vetapalem, Prakasam District, donated Rs.1,00,116/- For Annadanam scheme In memory of Late N. Venkata Seshu (her husband).
Post Comment