
శ్రీశైల దేవస్థానం:దేవస్థానం నిర్వహిస్తున్న ధర్మపథంలో భాగంగా (నిత్యకళారాధన కార్యక్రమం) శనివారం అహత సంగీతాలయం, హైదరాబాద్ వారు సంప్రదాయ నృత్య ప్రదర్శన కార్యక్రమం సమర్పించింది.
కార్యక్రమం లో గణపతిప్రార్ధన, శివతాండవం, అయిగిరినందిని, భో..శంభో తదితర గీతాలకు ఐశ్వర్యవాలి కాకులపాటి తదితరులు నృత్యప్రదర్శన చేసారు.
ఈ కార్యక్రమానికి వయోలిన్ సహకారాన్ని డి. జయసూర్య, ఓకల్ సహకారాన్ని కె. సాయి సర్యూ, మృదంగ సహకారాన్ని కె. వీరస్వామి అందించారు.
శ్రీ స్వామిఅమ్మవార్లకు ఆయా కైంకర్యాలన్నీ పరిపూర్ణంగా జరగాలని , ప్రాచీన సంప్రదాయ కళల పరిరక్షణలో భాగంగా ఈ నిత్యకళారాధన జరుగుతోంది.