శ్రీశైల దేవస్థానం:ధర్మపథంలో భాగంగా (నిత్యకళారాధన కార్యక్రమం) శుక్రవారం లక్షితాశ్రీ నృత్యకళాశాల, నందికొట్కూరు వారు సంప్రదాయ నృత్య ప్రదర్శన కార్యక్రమం సమర్పించారు.
ఆలయ దక్షిణ మాడవీధిలోని నిత్యకళారాధన వేదిక వద్ద సాయంకాలం 6 గంటల నుండి ఈ సంప్రదాయ నృత్య ప్రదర్శన జరిగింది.
ఈ కార్యక్రమం లో గణేశస్తుతి, శివతాండవం, శివాష్టకం, నాగేంద్రహారాయ, భో… శంబో నమశ్శివాయతే, తదితర గీతాలకు డి.సాయిలిక్షితాశ్రీ, స్వర్ణజ్యోతి తదితరులు నృత్య ప్రదర్శనను చేసారు.