
శ్రీశైల దేవస్థానం: ధర్మపథంలో భాగంగా (నిత్యకళారాధన కార్యక్రమం) సోమవారం బి. సత్యలక్ష్మీకుమారి, ఏలూరు కథక్ నృత్య కార్యక్రమం సమర్పించారు. ఆలయ దక్షిణ మాడవీధిలోని నిత్యకళారాధన వేదిక వద్ద సాయంకాలం ఈ కార్యక్రమం జరిగింది.
గణేశ ప్రార్థన, శివవందనం, భజన్, హోలీ వైభవం తదితర గీతాలకు బి. సత్యలక్ష్మీకుమారి నృత్య ప్రదర్శనను చేశారు.
తదుపరి రెండో కార్యక్రమం లో భాగంగా శ్రీ లలితా ఐశ్వర్యాంబిక నృత్య క్షేత్రం, రాజమండ్రి ,సంప్రదాయ నృత్యప్రదర్శన కార్యక్రమం సమర్పించారు.
వినాయక కౌత్వం, శివాష్టకం, శివతరంగం, భో..శంభో, సరస్వతి స్తుతి తదితర గీతాలకు శ్రీలక్ష్మీనృసింహ శర్మ, ఆర్ మనస్విని, కె. నాగవెంకట యజ్ఞసిరి, పి. వెంకట రమ్య, వై. చాందిని దేవి, దివ్యజ్యోష్ణ తదితరులు నృత్య ప్రదర్శన చేశారు .