శ్రీశైల దేవస్థానం:
దేవస్థానం నిర్వహిస్తున్న ధర్మపథంలో భాగంగా (నిత్యకళారాధన కార్యక్రమం) శనివారం శ్రీ గురు నృత్యాలయ కూచిపూడి డాన్సు అకాడమీ, హైదరాబాద్ వారు సంప్రదాయ నృత్య ప్రదర్శన కార్యక్రమం ఏర్పాటు చేశారు.
ఆలయ దక్షిణ మాడవీధిలోని నిత్యకళారాధన వేదిక వద్ద ఈ రోజు సాయంకాలం నుండి ఈ నృత్య ప్రదర్శన కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమములో గణపతి ప్రార్థన, శివపంచాక్షరి స్తోత్రం, చిదంబరస్తోత్రం, , జతిస్వరం, నమశ్శివాయతే తదితర గీతాలకు హిమశ్రీ, హిమవర్షిణి, సహస్ర, ధాత్రి, మయూఖ, శ్రీశ్రేష్ఠ, వైష్ణవి, అభిజ్ఞ తదితరులు నృత్య ప్రదర్శన చేశారు.
