శ్రీశైల దేవస్థానం: ధర్మపథంలో భాగంగా (నిత్యకళారాధన కార్యక్రమం) గురువారం శ్రీ నృత్యాలయ ఆర్ట్స్ అకాడమీ, అనంతపురం వారు సంప్రదాయ నృత్య ప్రదర్శన కార్యక్రమం సమర్పించారు.
ఆలయ దక్షిణ మాడవీధిలోని నిత్యకళారాధన వేదిక వద్ద ఈ రోజు సాయంకాలం నుండి ఈ నృత్య ప్రదర్శన కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమములో మహాగణపతిం, జతిస్వరం, శివపంచాక్షరి, భో..శంభో, కాలభైరవాష్టకం తదితర గీతాలకు కుందన, దీపిక, తేజు, ఆరాధ్య, శృతి, వెన్నెల, పద్మిని తదితరులు నృత్య ప్రదర్శన చేశారు
ఈ నిత్య కళారాధనలో ఆయా రోజులలో హరికథ, బుర్రకథ, సంప్రదాయ నృత్యం, వాయిద్య సంగీతం, భక్తిరంజని లాంటి కార్యక్రమాలు ఏర్పాటు అవుతున్నాయి.
శ్రీస్వామిఅమ్మవార్లకు ఆయా కైంకర్యాలన్నీ పరిపూర్ణంగా జరగాలని , ప్రాచీన సంప్రదాయ కళల పరిరక్షణలో భాగంగా ఈ నిత్యకళారాధన కార్యక్రమాలు జరుగుతున్నాయి.
