
శ్రీశైల దేవస్థానం: ధర్మపథంలో భాగంగా (నిత్యకళారాధన కార్యక్రమం) ఆదివారం ఎస్ నటరాజ డాన్సు అకాడమీ, కడప జిల్లా వారు సంప్రదాయ నృత్య ప్రదర్శన కార్యక్రమం సమర్పించారు.
ఆలయ దక్షిణ మాడవీధిలోని నిత్యకళారాధన వేదిక వద్ద ఈ రోజు సాయంకాలం నుండి ఈ సంప్రదాయ నృత్య ప్రదర్శన కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమం లో మహాగణపతిం, శ్రీగణనాథం, శివశివశంకరా, ఓం నమ:శివాయా, అయిగిరినందిని తదితర గీతాలకు హిమబిందు, సంగీత, జ్ఞానజ్యోత్స్న, జయశ్రీ, బాలయోగి సిరినందన, విజయబాబు తదితరులు నృత్య ప్రదర్శన చేశారు.
ఈ నిత్య కళారాధనలో ప్రతిరోజూ హరికథ, బుర్రకథ, సంప్రదాయ నృత్యం, వాయిద్య సంగీతం, భక్తిరంజని లాంటి ఆయా కార్యక్రమాలు ఏర్పాటు అవుతున్నాయి.
శ్రీ స్వామిఅమ్మవార్లకు ఆయా కైంకర్యాలన్నీ పరిపూర్ణంగా జరగాలని , ప్రాచీన కళల పరిరక్షణలో భాగంగా ఈ నితకళారాధన
సంప్రదాయ కార్యక్రమాలు జరుగుతున్నాయి.