
శ్రీశైల దేవస్థానం: ధర్మపథంలో భాగంగా (నిత్యకళారాధన కార్యక్రమం) ఆదివారం శ్రీ సౌఖ్య నృత్యకళా నికేతన్, హైదరాబాద్ వారు సంప్రదాయ నృత్య ప్రదర్శన కార్యక్రమం సమర్పించారు.
ఆలయ దక్షిణ మాడవీధిలోని నిత్యకళారాధన వేదిక వద్ద ఈ రోజు సాయంకాలం నుండి ఈ సంప్రదాయ నృత్య కార్యక్రమం జరిగింది .
ఈ కార్యక్రమం లో గణపతి ప్రార్థన, శివతాండవం, భో… శంభో, శివ శివ శంకరా, నమ:శివాయతే, కాలభైరవాష్టకం, తదితర గీతాలకు, అష్టకాలకు వర్షిణి, తేజు, ప్రియ, శోభారాణి, పౌర్ణమి, గౌరి, మౌనిక, కీర్తి, ఇందిర, సుధారాణి, అద్వైత, చక్రిక, మన్విత తదితరులు నృత్యప్రదర్శన చేశారు.