శ్రీశైల దేవస్థానం: ధర్మపథంలో భాగంగా (నిత్యకళారాధన కార్యక్రమం) గురువారం శ్రీ భాస్కర డాన్సు అకాడమి, హైదరాబాద్ వారు సంప్రదాయ నృత్యప్రదర్శన కార్యక్రమం సమర్పించారు.ఆలయ దక్షిణ మాడవీధిలోని నిత్యకళారాధన వేదిక వద్ద సాయంకాలం నుండి ఈ సంప్రదాయ నృత్య ప్రదర్శన కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమం లో గణపతి తాండవం, మహాగణపతిం, శివాష్టకం, శివతాండవం చిదంబర స్తోత్రం, లింగాష్టకం, అయిగిరినందిని తదితర గీతాలకు, అష్టకాలకు సాత్విక, శ్రీశ్వేత, వేద, సాహితి, అక్షయ్య, మనస్వి, భవ్య, యోగిత తదితరులు నృత్యప్రదర్శన చేశారు.