సంప్రదాయ నృత్య ప్రదర్శన
శ్రీశైల దేవస్థానం: ధర్మపథంలో భాగంగా (నిత్యకళారాధన కార్యక్రమం) మంగళవారం శ్రీసాయి కృపా కూచిపూడి కళాక్షేత్రం, మహబూబ్నగర్ వారు సంప్రదాయ నృత్యప్రదర్శన కార్యక్రమం సమర్పించారు.
ఆలయ దక్షిణ మాడవీధిలోని నిత్యకళారాధన వేదిక వద్ద సాయంకాలం నుండి ఈ సంప్రదాయ నృత్య కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమం లో వినాయక ప్రార్థన, ప్రణవాకారం, ఈశాగిరీశా, భో… శంభో, శివాష్టకం తదితర అష్టకాలకు, గీతాలకు హిమబిందు, ఉషరాణి, అనుశ్రీ, పల్లవి, భాగ్యలక్ష్మి భవాని, శ్రీప్రియ, మమత, నవ్యశ్రీ తదితరులు నృత్య ప్రదర్శన చేశారు.
రెండో కార్యక్రమం లో భాగంగా శ్రీ సృజన , వారి బృందం, హైదరాబాద్ వారు సంప్రదాయ నృత్య ప్రదర్శన కార్యక్రమం సమర్పించారు.
కాగా ఈ నిత్య కళారాధనలో ప్రతిరోజూ హరికథ, బుర్రకథ, సంప్రదాయ నృత్యం, వాయిద్య సంగీతం, భక్తిరంజని లాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి.
శ్రీస్వామిఅమ్మవార్లకు ఆయా కైంకర్యాలన్నీ పరిపూర్ణంగా జరగాలని , ప్రాచీన సంప్రదాయ కళల పరిరక్షణలో భాగంగా ఈ నిత్యకళారాధన జరుగుతోంది
Post Comment