
శ్రీశైల దేవస్థానం:ధర్మపథంలో భాగంగా (నిత్యకళారాధన కార్యక్రమం) మంగళవారం శ్రీ కృష్ణ సంగీత , నృత్య పాఠశాల, వరంగల్ వారు సంప్రదాయ నృత్యప్రదర్శన కార్యక్రమం ఏర్పాటు చేశారు.
ఆలయ దక్షిణ మాడవీధిలోని నిత్యకళారాధన వేదిక వద్ద సాయంకాలం నుండి ఈ సంప్రదాయ నృత్య ప్రదర్శన కార్యక్రమం ఏర్పాటు చేశారు
ఈ కార్యక్రమం లో గణపతి ప్రార్థన, శంకర శ్రీగిరినాథ ప్రభో, శివపంచాక్షరీ స్తోత్రం, హిమగిరి తనయ, అఖిలాండేశ్వరి, సరస్వతిస్తుతి, తదితర గీతాలకు, అష్టకాలు మొదలైన వాటికి కస్తూరి సుమన, అక్షిత, తన్మయి, తేజస్విని, సమన్విత, భువి, నక్షత్ర, లక్ష్మీచిన్మయి, సునేత్ర, వరుణవి, సంకీర్తన తదితరులు నృత్య ప్రదర్శన చేశారు.
కాగా ఈ నిత్య కళారాధనలో ప్రతిరోజూ హరికథ, బుర్రకథ, సంప్రదాయ నృత్యం, వాయిద్య సంగీతం, భక్తిరంజని లాంటి కార్యక్రమాలు ఏర్పాటు అవుతున్నాయి .
శ్రీస్వామిఅమ్మవార్లకు ఆయా కైంకర్యాలన్నీ పరిపూర్ణంగా జరగాలని , ప్రాచీన సంప్రదాయ కళల పరిరక్షణలో భాగంగా ఈ కళారాధన జరుగుతోంది.