
శ్రీశైల దేవస్థానం:నిత్యకళారాధన కార్యక్రమంలో మంగళవారం శ్రీ మీనాక్షి నృత్యాలయ ఆర్ట్స్ అకాడమీ, నెల్లూరు జిల్లా సంప్రదాయ నృత్యప్రదర్శన కార్యక్రమం సమర్పించింది.
ఈ కార్యక్రమములో మహాగణపతిం, నమ:శివాయతే, శివతాండవం, అయిగిరి నందిని, హరహర శంకరా, నమశ్శివాయతే, కాలభైరవాష్టకం తదితర గీతాలకు, అష్టకాలకు ఆరాధ్య, శ్రీరామ్, కార్తికేయని, చైత్రప్రభ, హేమవర్షిణి, లక్ష్య, భవిష్క, గీతిక, దీపికా, మనస్విని, గణేశ్, శిరీష, లాస్య, ప్రణవి తదితరులు నృత్య ప్రదర్శన చేశారు.
ఈ నిత్య కళారాధనలో ప్రతిరోజూ హరికథ, బుర్రకథ, సంప్రదాయ నృత్యం, వాయిద్య సంగీతం, భక్తిరంజని లాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు,
శ్రీస్వామిఅమ్మవార్లకు ఆయా కైంకర్యాలన్నీ పరిపూర్ణంగా జరగాలని, ప్రాచీన సంప్రదాయ కళల పరిరక్షణలో భాగంగా ఈ నిత్యకళారాధన కార్యక్రమాలు జరుగుతున్నాయి.