కళారాధన సంగీత , నృత్య అకాడమీ, విశాఖపట్నం సమర్పించిన సంప్రదాయ నృత్య ప్రదర్శన

 శ్రీశైల దేవస్థానం:దేవస్థానం  నిర్వహిస్తున్న ధర్మపథంలో భాగంగా (నిత్యకళారాధన కార్యక్రమం) శుక్రవారం  కళారాధన సంగీత , నృత్య అకాడమీ, విశాఖపట్నం వారు సంప్రదాయ నృత్య ప్రదర్శన కార్యక్రమం సమర్పించారు.

ఆలయ దక్షిణ మాడవీధిలోని నిత్యకళారాధన వేదిక వద్ద ఈ రోజు సాయంకాలం నుండి

ఈ సంప్రదాయ నృత్య ప్రదర్శన కార్యక్రమం జరిగింది.

ఈ కార్యక్రమములో మహాగణపతిం, శివపంచాక్షరీస్తోత్రం,  శశివదన,కాలభైరవాష్టకం, అయిగిరినందిని, గిరిజకల్యాణం తదితర గీతాలకు, అష్టకాలకు నిర్విజ్ఞ, గ్రీష్మ, చంద్రిక, నిహారిక, రాధ తరంగిణి తదితరులు నృత్య ప్రదర్శన చేశారు.

కాగా ఈ నిత్య కళారాధనలో ప్రతిరోజూ హరికథ, బుర్రకథ, సంప్రదాయ నృత్యం, వాయిద్య

సంగీతం, భక్తిరంజని లాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు.

శ్రీస్వామిఅమ్మవార్లకు ఆయా కైంకర్యాలన్నీ పరిపూర్ణంగా జరగాలని , ప్రాచీన సంప్రదాయ కళల పరిరక్షణలో భాగంగా ఈ కళారాధన జరుగుతోంది.

print

By Online News Diary

ONLINENEWSDIARY.COM - A Multilingual Online News Portal

Leave a Reply

Your email address will not be published.