శ్రీశైల దేవస్థానం:దేవస్థానం నిర్వహిస్తున్న ధర్మపథంలో భాగంగా (నిత్యకళారాధన కార్యక్రమం) గురువారం రాధాకృష్ణ సంగీత నృత్యకళా క్షేత్రం , ధవళేశ్వరం, రాజమహేంద్రవరం వారు సంప్రదాయ నృత్య ప్రదర్శన కార్యక్రమం సమర్పించారు.
ఆలయ దక్షిణ మాడవీధిలోని నిత్యకళారాధన వేదిక వద్ద ఈ రోజు సాయంకాలం నుండి ఈ సంప్రదాయ నృత్య ప్రదర్శన కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమం లో వినాయక కౌత్వం, మహాగణపతిం, లింగాష్టకం, కాళభైరవాష్టకం, కనకధారస్తోత్రం, ఆనందతాండవం తదితర గీతాలకు, అష్టకాలకు లక్ష్మీ దీపిక, హర్షిత అమృత, కార్తికేయని, భవ్యతేజస్విని, కీర్తి, పర్ణిక, శరణ్య, పూజ, వర్షిణి, ప్రణిత, కావ్య, భవ్యసిరిచందన, ప్రణవి, కిరణ్మయి తదితరులు నృత్య ప్రదర్శన చేశారు.
కాగా ఈ నిత్య కళారాధనలో ప్రతిరోజూ హరికథ, బుర్రకథ, సంప్రదాయ నృత్యం, వాయిద్య సంగీతం, భక్తిరంజని లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
శ్రీస్వామిఅమ్మవార్లకు ఆయా కైంకర్యాలన్నీ పరిపూర్ణంగా జరగాలని , ప్రాచీన కళల పరిరక్షణలో భాగంగా ఈ నిత్యకళారాధన సంప్రదాయ కార్యక్రమాలు జరుగుతున్నాయి.