టీ.వి. గంగాధరం , బృందం, కర్నూలు సమర్పించిన   సంప్రదాయ నృత్య ప్రదర్శన

శ్రీశైల దేవస్థానం:దేవస్థానం  నిర్వహిస్తున్న ధర్మపథంలో భాగంగా (నిత్యకళారాధన కార్యక్రమం) మంగళవారం  టీ.వి. గంగాధరం , వారి బృందం, కర్నూలు వారు  సంప్రదాయ నృత్య ప్రదర్శన కార్యక్రమం సమర్పించారు.

ఆలయ దక్షిణ మాడవీధిలోని నిత్యకళారాధన వేదిక వద్ద ఈ రోజు సాయంకాలం నుండి ఈ సంప్రదాయ నృత్య ప్రదర్శన కార్యక్రమం జరిగింది.

ఈ కార్యక్రమం లో గణేశకౌత్వం, సిద్ధివినాయక, శివశివ భవభవ, జతిస్వరం, ఆనందతాండవం, శివతాండవం, రాజరాజేశ్వరి అష్టకం తదితర గీతాలకు , అష్టకాలకు విజేత, శ్రీవాణి, పార్వతమ్మ, అక్షర, ఆధ్య, అఖిల, బృంద, హర్షిణి, హర్షిత, చైత్రిక తదితరులు నృత్య ప్రదర్శన చేశారు.

కాగా ఈ నిత్య కళారాధనలో ప్రతిరోజూ హరికథ, బుర్రకథ, సంప్రదాయ నృత్యం, వాయిద్య సంగీతం, భక్తిరంజని లాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి.

శ్రీస్వామిఅమ్మవార్లకు ఆయా కైంకర్యాలన్నీ పరిపూర్ణంగా జరగాలని , ప్రాచీన సంప్రదాయ కళల పరిరక్షణలో భాగంగా ఈ నిత్యకళారాధన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

print

By Online News Diary

ONLINENEWSDIARY.COM - A Multilingual Online News Portal

Leave a Reply

Your email address will not be published.