
శ్రీశైల దేవస్థానం:దేవస్థానం నిర్వహిస్తున్న ధర్మపథంలో భాగంగా (నిత్యకళారాధన కార్యక్రమం) బుధవారం సూర్యకళా కల్చరర్ అకాడమీ, కర్నూలు వారిచే కార్యక్రమం సమర్పించారు.
ఆలయ దక్షిణ మాడవీధిలోని నిత్యకళారాధన వేదిక వద్ద ఈ రోజు సాయంకాలం నుండి ఈ కూచిపూడి నృత్య ప్రదర్శన కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమం లో గణేశ ప్రార్థన, మహిషాసుర మర్దిని, శివతాండవం, శంభో శివ శంభో తదితర గీతాలకు డి.వి. మోక్షిత, గుణత్రయ, ప్రణతి, ప్రణీత, బ్రహ్మశ్రీ, జనని, కీర్తిక, గీతాశ్రీ, రచన, భవ్యశ్రీ, వాత్సల్య, లక్ష్మీ నవ్యశ్రీ తదితరులు నృత్య ప్రదర్శన చేశారు.
ఈ నిత్య కళారాధనలో ప్రతిరోజూ హరికథ, బుర్రకథ, సంప్రదాయ నృత్యం, వాయిద్య సంగీతం, భక్తిరంజని లాంటి కార్యక్రమాలు ఏర్పాటు అవుతున్నాయి.
శ్రీస్వామిఅమ్మవార్లకు ఆయా కైంకర్యాలన్నీ పరిపూర్ణంగా జరగాలని , ప్రాచీన సంప్రదాయ కళల పరిరక్షణలో భాగంగా ఈ నిత్యకళారాధన కార్యక్రమాలు జరుగుతున్నాయి.