శ్రీశైల దేవస్థానం: ధర్మపథంలో భాగంగా (నిత్యకళారాధన కార్యక్రమం) గురువారం టి. నాగశ్రీ ప్రవల్లిక , వారి బృందం, చెరుకుపల్లి, గుంటూరు సంప్రదాయ నృత్య ప్రదర్శన కార్యక్రమం సమర్పించారు. శ్రీ గణపతిని సేవింపరారే, వినాయకకౌత్వం, శివస్తుతి, నమశ్శివాయతే, శంభో… శివశంభో, కాళభైరవాష్టకం తదితర అష్టకాలకు, గీతాలకు నాగసుస్మిత, చెరుకుపల్లి నాగశ్రీప్రవల్లిక, శరణ్య, ఖ్యాతీశ్వరి, తేజశ్రీ, పి. తపస్వి, దేనివ్య, భువన, చిన్మయి, సంస్కృతి, ఉమేష్ కావ్య, దీక్షిత, మోక్షిత, భావజ్ఞ, భవ్య, నిత్యశ్రీ తదితరులు నృత్య ప్రదర్శన చేసారు.