
శ్రీశైల దేవస్థానం: ధర్మపథంలో భాగంగా (నిత్యకళారాధన కార్యక్రమం) సోమవారం నాగశ్రీ ప్రవళ్ళిక , బృందం, గుంటూరు వారు సంప్రదాయ నృత్య ప్రదర్శన సమర్పించారు.
ఈ కార్యక్రమంలో మహాగణపతిం, శంభో శివ శంభో, శివస్తుతి, దేవిస్తుతి, ప్రణవనాదం, అదిగదిగో శ్రీశైలం తదితర గీతాలకు పి. హరిశ్రీ, ఎం. అనన్య, పి. జస్విత, స్నేహిత, సి.హెచ్. లలిత, ఎం. లాస్య మృదిని, ఎస్. నిఖితసాయిలీల, పి. లౌక్యశ్రీ తదితరులు నృత్య ప్రదర్శన చేసారు.