శ్రీశైల దేవస్థానం: ధర్మపథంలో భాగంగా(నిత్య కళారాధన కార్యక్రమం) శనివారం శ్రీమతి ఓ. రంగమణి బృందం, హైదరాబాద్ సంప్రదాయ నృత్య ప్రదర్శన కార్యక్రమం సమర్పించింది.ఆలయ దక్షిణ మాడవీధిలోని నిత్యకళారాధన వేదిక వద్ద 6 గంటల నుండి ఈ సంప్రదాయ నృత్యం కార్యక్రమం జరిగింది. వినాయకస్తుతి, శివతాండవస్తోత్రం, ఓం నమ:శివాయ, శంభో..శివశంభో తదితర గీతాలతకు వైష్ణవి, మధుమిత, సిరివెన్నెల, సువిధ, నిగమ, శ్రీజ, నేహా లావణ్య, రుచిత, సంస్కృతి, సాత్విక, శ్రావణి, లాస్య, సహస్ర. గాయత్రి, వైష్ణవి తదితరులు నృత్య ప్రదర్శన చేసారు.