
శ్రీశైల దేవస్థానం:ధర్మపథంలో భాగంగా (నిత్యకళారాధన కార్యక్రమం) శనివారం లిక్షితాశ్రీ నృత్య కళాశాల, నందికొట్కూరు వారు సంప్రదాయ నృత్య ప్రదర్శన కార్యక్రమం సమర్పించారు.
ఆలయ దక్షిణ మాడవీధిలోని నిత్యకళారాధన వేదిక వద్ద సాయంకాలం ఈ ప్రదర్శన జరిగింది.
కార్యక్రమం లో మహాగణపతిం, శివాష్టకం, .. శంబో, ప్రణవాకారం, ఏకదంతాయ, లింగాష్టకం తదితర గీతాలకు డి. సాయిలిక్షితాశ్రీ, డి. సాయిజక్షిత్, వై. వెంకటేశ్వర్లు, వి. సహస్ర, జె. మోక్షిత తదితరులు నృత్య ప్రదర్శనను చేసారు.
నిత్య కళారాధనలో ప్రతిరోజూ హరికథ, బుర్రకథ, సంప్రదాయ నృత్యం, వాయిద్య సంగీతం, భక్తిరంజని లాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి.
శ్రీ స్వామిఅమ్మవార్లకు ఆయా కైంకర్యాలన్నీ పరిపూర్ణంగా జరగాలని, ప్రాచీన సంప్రదాయ కళల పరిరక్షణలో భాగంగా ఈ నిత్య కళారాధన కార్యక్రమాలు జరుగుతున్నాయి.