-TMS meet at a glance
*టి.ఎమ్.ఎస్ అనుసంధానం పై సమీక్షా సమావేశం
*శ్రీశైల దేవస్థానం:దేవాదాయ శాఖ రూపొందించిన టి.ఎమ్.ఎస్ (టెంపుల్ మేనేజ్మెంట్ సిస్టమ్) మాడ్యుల్స్ కు అనుగుణంగా దేవస్థానపు ఆయా విభాగాలకు సంబంధించిన డేటా నమోదు ప్రక్రియపై ఈ రోజు (29.03.2021)న కార్యనిర్వహణాధికారి కె.ఎస్.రామరావు సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.
అన్నపూర్ణ భవన సముదాయం లోని సి.సి. కంట్రోల్ రూములో జరిగిన ఈ సమావేశంలో అన్ని విభాగాల యూనిట్ అధికారులు శాఖాధికారులు), పర్యవేక్షకులు, గుమస్తాలు, కంప్యూటర్ ఆపరేటర్లు తదితర సిబ్బంది పాల్గొన్నారు.
కార్యనిర్వహణాధికారి మాట్లాడుతూ దేవాదాయ శాఖ రూపొందించిన టి.ఎమ్.ఎస్ మాడ్యుళ్ళకు అనుగుణంగా అన్ని విభాగాల అధికారులు, సిబ్బందిని వారి విభాగానికి సంబంధించిన సమాచారాన్ని (డేటాను) నిక్షిప్తం చేసే కార్యక్రమాన్ని వెంటనే ప్రారంభించాలన్నారు.
దేవస్థానం లోని అన్ని శాఖల అధికారులు (యూనిట్ అధికారులు), పర్యవేక్షకులు రోజువారీగా ఈ నమోదు ప్రక్రియను ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తుండాలన్నారు.
ఇందుకోసమై అధికారులు, పర్యవేక్షకులు తక్కిన సిబ్బంది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పై (సమచార సాంకేతికత) అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు.
ఇందుకోసమై తరుచుగా సిబ్బందికి కంప్యూటర్ వినియోగం, టి.ఎమ్.ఎస్ సాఫ్ట్ వేర్ పై శిక్షణను యిస్తుండాలని దేవస్థానపు ఐ.టి విభాగాన్ని ఆదేశించారు. రోజువారీగా వచ్చే దేవస్థాన రాబడి అనగా దర్శనాలు, ఆర్జితసేవలు, ప్రసాదాల విక్రయం,టోలు గేట్, వసతి బాడుగలు మొదలైనవన్నీ కూడా దేవదాయశాఖ రూపొందించిన టి.ఎమ్.ఎస్ విధానములో కంప్యూటరైజ్ పద్ధతిలో నిర్వహిస్తారని , కాబట్టి అన్ని విభాగాల అధికారులు రోజువారిగా ఎప్పటికప్పుడు రాబడి సంబంధించి అంశాలన్నిటినీ ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తుండాలన్నారు.
అదేవిధంగా వివిధ స్టోర్స్ విభాగాలు చేసే కొనుగోళ్ళను ఎప్పటికప్పుడు టి.ఎమ్.ఎస్ విధానములో నమోదుచేయాలన్నారు.
ఇండెంట్ పూర్వకంగా ఆయా సామగ్రి వినియోగానికి సంబంధించిన వినియోగపు డేటాను కూడా ఏరోజుకారోజు నమోదు చేస్తుండాలని ఆదేశించారు.
ప్రతీ విభాగపు అధికారి, పర్యవేక్షకులు, తదితర గుమస్తా సిబ్బంది ఎప్పటికప్పుడు తమ విభాగములో జరిగే డేటా ఎంట్రీలను పర్యవేక్షిస్తూ రోజువారీగా స్వీయ విభాగ సమీక్షను నిర్వహించుకోవాలన్నారు.
అలాగే శాశ్వత కల్యాణం, శాశ్వత అన్నదానం ఇతర శాశ్వత పూజలు మొదలైన వాటి వివరములను పొందుపరిచేటప్పుడు సంబంధిత సిబ్బంది ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా జాగ్రత్తతో ఆయా వివరాలను పొందుపరచవలసివుంటుందన్నారు.
ముఖ్యంగా భక్తులు ఆయా శాశ్వత సేవలకు రుసుములు చెల్లించేటప్పుడు, సంబంధిత సిబ్బంది వారి గోత్రనామాలు, పూజ జరిపించవలసిన రోజు మొదలైనవివరాలను స్పష్టంగా తెలుసుకొని వాటిని నమోదు చేస్తుండాలన్నారు. దీనివలన వివరాల నమోదును పొరపాట్లు లేకుండా చేసే అవకాశం వుంటుందన్నారు.
*Donation of Rs.1,30,000/- For Annadhaanam scheme and Rs.1,00,000/- For Go Samrakshana Nidhi By N.Sudheer , Bapatla , Guntur District.
*Sahasra deepaarchana seva performed in the temple.