హైదరాబాద్: మణికొండ , పుప్పాల గూడాలోని శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయంలో మొట్టమొదటసారిగా ఆదివారం శ్రీ తిరుమొడిశై ఆళ్వార్ల తిరు నక్షత్రమహోత్సవమ్ జరిగింది. ఆళ్వార్ ఆచార్య సేవా సమితి ఆధ్వర్యంలో ఈ సంప్రదాయ కార్యక్రమం నిర్వహించారు. సమితి కార్యవర్గం వారు, అర్చకలు, భక్తులు పాల్గొన్నారు. ఆళ్వార్ ఆచార్య సేవా సమితి వారి సమావేశం ఇటీవల మణికొండ శ్రీ అనంత పద్మనాభ స్వామి వారి దేవాలయం ప్రాంగణంలో జరిపి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.
*శ్రీ వైష్ణవ విశిష్టాద్వైత ప్రచారం లో భాగంగా శ్రీ వైష్ణవ ఆలయాలలో జరగవలసిన శ్రీ వైష్ణవ ఆళ్వార్ ఆచార్య తిరు నక్షత్ర,హోమ,విశేష పూజా కార్యక్రమాలు ,ముఖ్యంగా శ్రీ దేవి భూదేవి సహిత శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయం,పుప్పాలగూడా,మణికొండ లో ప్రత్యేకంగా ఉత్సవాలు జరగాలని సంకల్పం తో శ్రీ విశిష్టాద్వైత
సిద్ధాంతం ఆచరించే భాగవతోత్తములు ఆచార్య ఆళ్వార్ సేవా సమితిని మణికొండ లో ఏర్పాటు చేసారు. శ్రీ అనంత పద్మనాభ స్వామి వారి ఆలయ కమిటీ , ఇతర ఆలయాలలో ఆయా కమిటీల వారిని కలుపుకొని , చర్చించి , వారి సహకారం తో ఆలయాలలో పూజాది ,ఉత్సవ కార్యక్రమాలు నిర్వహించటానికి ఆళ్వార్ ఆచార్య సేవ సమితి వారు నిర్ణయించారు.