దసరా మహోత్సవాలలో మూడో రోజు శనివారం అమ్మవారికి చంద్రఘంట అలంకారం, స్వామిఅమ్మవార్లకు*రావణవాహనసేవ*
శ్రీశైల దేవస్థానం:
• దసరా మహోత్సవాలలో భాగంగా మూడో రోజు శనివారం అమ్మవారికి చంద్రఘంట అలంకారం,
• స్వామిఅమ్మవార్లకు*రావణవాహనసేవ*
• అమ్మవారికి శ్రీచక్రార్చన, నవావరణార్చన, విశేష కుంకుమార్చనలు
• రుద్రహోమం, చండీహోమం
• ఉత్సవాలలో భాగంగానే చతుర్వేదపారాయణలు, రుద్రపారాయణ, చండీపారాయణ, , జపానుష్ఠానాలు జరిగాయి.
*ఈ ఓ తదితర అధికారులు , సిబ్బంది, భక్త జనం పాల్గొన్నారు.
*దసరా మహోత్సవాలలో భాగంగా ఈ రోజు ఉదయం అమ్మవారికి ప్రాత:కాల పూజలు, విశేష కుంకుమార్చనలు, నవావరణార్చనలు, జపానుష్ఠానాలు, పారాయణలు, సూర్య నమస్కారములు, చండీహోమం, పంచాక్షరి, భ్రామరి, బాలా జపానుష్ఠానములు, చండీపారాయణ, చతుర్వేద పారాయణలు, కుమారీపూజలు జరిపారు
అదేవిధంగా రుద్రహోమం, రుద్రయాగాంగ జపములు, రుద్ర పారాయణలు జరిపారు. ఈ సాయంకాలం జపములు, పారాయణలు, నవావరణార్చన, కుంకుమార్చన, చండీ హోమం జరిగాయి.
ఈ రోజు రాత్రి 9.00గంటల నుండి కాళరాత్రిపూజ, అమ్మవారి ఆస్థాన సేవ, సువాసినీపూజలు నిర్వహించారు.
కుమారీ పూజ:
దసరా మహోత్సవాలలో భాగంగా ప్రతీరోజు కుమారీ పూజలు జరుగుతున్నాయి.
ఈ కుమారిపూజలో రెండు సంవత్సరాల నుంచి పది సంవత్సరాల వయస్సు ఉన్న బాలికలను పూలు, పండ్లు, నూతన వస్త్రాలను సమర్పించి పూజించడం జరుగుతోంది. కుమారి పూజ నవరాత్రి ఉత్సవాలలో ఒక ముఖ్యమైన సంప్రదాయం
చంద్రఘంట అలంకారం:
ఈ నవరాత్రి మహోత్సవాలలో చేయబడుతున్న నవదుర్గ అలంకారాలలో భాగంగా శ్రీ అమ్మవారి ఉత్సవమూర్తిని చంద్రఘంట స్వరూపంలో అలంకరించారు.
నవదుర్గలలో మూడవ రూపమైన ఈ దేవి దశ భుజాలను కలిగి ఉండి ప్రశాంతమైన వదనంతో సాత్విక స్వరూపిణిగా ఉంటుంది. ఈ దేవి శాంతస్వరూపిణి అయినప్పటికీ యుద్ధోన్ముఖురాలై ఉండటం విశేషం.
ఈ అమ్మవారి మస్తకంపై అర్ధచంద్రుడు అలరాడుతున్న కారణంగా చంద్రఘంటాదేవిగా పిలుస్తారు.
ఈ దేవిని పూజించడం వల్ల భక్తుల కష్టాలన్నీ తీరుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. ఇంకా
ఈ దేవీ ఆరాధన వల్ల సౌమ్యం, వినమ్రత కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి.
రావణవాహనసేవ:;
ఈ ఉత్సవాలలో శ్రీస్వామిఅమ్మవార్లకు నిర్వహిస్తున్న వాహనసేవలలో భాగంగా ఈ రోజు రావణవాహనసేవ జరిగింది. ఈ వాహనసేవలో శ్రీ స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరింపజేసి, రావణవాహనంపై వేంచేబు చేయించి పూజాదికాలు జరిపారు. అనంతరం గ్రామోత్సవం జరిగింది.
*శాశ్వత అన్నప్రసాద పథకానికి విరాళంగా రూ.1,00,501/-లను పి.వి. కృష్ణంరాజు, హైదరాబాద్
అందజేశారు. ఈ మొత్తాన్ని పర్యవేక్షకులు టి హిమబిందుకు అందించారు. దాతకు రశీదు, ప్రసాదాలు, శేషవస్త్రం అందించారు. .
*శాశ్వత అన్నప్రసాద పథకానికి విరాళంగా రూ.1,00,116/-లను జి. హరికిషన్ సింగ్, కర్నూలు అందజేశారు. ఈ మొత్తాన్ని పర్యవేక్షకులు మధుసూదన్‌రెడ్డికి అందించారు . దాతకు తగు రశీదు, ప్రసాదాలు, శేషవస్త్రం అందించారు.
Post Comment