శ్రీశైల దేవస్థానం:ఆజాది కా అమృత్ మహోత్సలో భాగంగా ఆదివారం శ్రీశైల మహాక్షేత్రం లో శ్రీశైల జగద్గురు పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ చెన్నసిద్ధరామ శివాచార్య మహాస్వామి వారి ఆధ్వర్యములో ప్రత్యేక కార్యక్రమం జరిగింది.ఈ కార్యక్రమం లో దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎస్. లవన్న తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా జాతీయ జెండాను చేతబూని ప్రధాన రహదారులలో ర్యాలీ నిర్వహించారు.
జగద్గురు పీఠాధిపతి అనుగ్రహ భాషణం చేస్తూ ఎందరో మహానుభావుల త్యాగఫలితంగా మనకు స్వాతంత్ర్యం లభించిందన్నారు. దేహం కంటే దేశం ముఖ్యమని అదేవిధంగా ధనం కంటే ధర్మం ముఖ్యమన్నారు. అందుకే ప్రతి పౌరుడు కూడా దేశాభిమానంతో, ధర్మాభిమానంతో జీవనం సాగించాలన్నారు. ప్రతీ పౌరుడు కూడా దేశ గౌరవాన్ని, దేశయొక్క కీర్తి ప్రతిష్టలు కాపాడేందుకు కృషి చేయాలన్నారు.
శివాచార్య సుగురేశ్వరస్వామి, శివాచార్య జైనాపూర్ స్వామి, శివాచార్య జంఖండీ స్వామి, పలువురు దేవస్థానం అధికారులు పాల్గొన్నారు.