శ్రీశైల దేవస్థానం: కార్తీకమాసోత్సవాల సందర్భంగా మాసశివరాత్రి రోజున నవంబరు 18వ తేదీన పాతాళగంగలో శ్రీస్వామిఅమ్మవార్లకు తెప్పోత్సవాన్ని జరిపించాలని గతంలో నిర్ణయించారు కానీ పాతాళగంగలో నీటిమట్టం పెరిగిన కారణంగా ,తెప్పోత్సవాన్ని వాయిదా వేసారు.
పాతాళగంగలో నీటిమట్టం విషయమై డ్యాం మెయింటెనెన్స్ ఇంజనీరింగ్ అధికారులను సంప్రదించారు. ప్రస్తుతం డ్యాం నీటిమట్టం +883.20 అడుగులు , సామర్థ్యం 205.6627 టి.యం.సిలు ఉన్నట్లుగా వారు తెలిపారు. అదేవిధంగా జెన్ కో పవర్ హౌస్ ద్వారా నిరంతరం విద్యుత్ ఉత్పత్తి జరుగుతున్నందున నీటిమట్టంలో ఆకస్మికంగా హెచ్చుతగ్గులు వచ్చే అవకాశం ఉన్నదని కూడా డ్యాం అధికారులు తెలిపారు.
భద్రతా కారణాల దృష్ట్యా పాతాళగంగలో ప్రస్తుతం తెప్పోత్సవం నిర్వహించడం శ్రేయస్కరం కానందున, తెప్పోత్సవ కార్యక్రమాన్ని వాయిదా వేసారు.
భక్తులు ఈ విషయాన్ని గమనించవలసినదిగా దేవస్థానం కోరింది.
