శ్రీస్వామిఅమ్మవార్లకు తెప్పోత్సవం

 శ్రీశైల దేవస్థానం:దసరా మహోత్సవాలను పురస్కరించుకుని మంగళవారం సాయంత్రం శ్రీస్వామిఅమ్మవార్లకు తెప్పోత్సవం నిర్వహించారు. ఆలయ పుష్కరిణి వద్ద ఈ తెప్పోత్సవ కార్యక్రమం జరిగింది.

తెప్పోత్సవ కార్యక్రమంలో ముందుగా ఆలయ ప్రాంగణంలో శ్రీస్వామిఅమ్మవార్ల  ఉత్సవమూర్తులకు షోడశోపచార పూజలను నిర్వహించారు. తరువాత ఉత్సవమూర్తులను ఆలయ రాజగోపురం నుండి ఊరేగింపుగా తొడ్కోని వచ్చి పుష్కరిణిలో ఏర్పాటు చేసిన ప్రత్యేక తెప్పపై వేంచేబు చేయించి విశేషపూజాదికాలను నిర్వహించారు.

తరువాత మంగళవాయిద్యాల నడుమ వేదమంత్రాలతో ఎంతో శాస్త్రోక్తంగా ఈ తెప్పోత్సవం జరిగింది.

కాగా వివిధ రకాల పుష్పాలతో, విద్యుత్ దీపాలంకరణతో ఈ తెప్ప ఎంతో కళాత్మకంగా ఏర్పాటైంది.

తెప్ప అలంకరణకు గాను ఎర్రబంతి, పసుపు బంతి, తెల్లచేమంతి, పసుపు చేమంతి, కనకాంబరాలు, డచ్ రోస్, కాగడాలు, గ్లాడియేలస్, జబ్రా, కార్నేషన్, ఆర్కిడ్స్, నందివర్ధనం, గరుడవర్ధనం మొదలైన పలు రకాల పుష్పాలను వినియోగించారు.

ఇంకా పలురకాల పత్రమాలలు కూడా ఈ తెప్ప అలంకరణకు వినియోగించారు. ఇంకా విద్యుత్ దీపాలతో కూడా ఈ తెప్ప అలంకరణ చేసారు.

print

Post Comment

You May Have Missed