×

తెప్పోత్సవం మక్కువ గొలిపెను మనకోసం

తెప్పోత్సవం మక్కువ గొలిపెను మనకోసం

 శ్రీశైల దేవస్థానం: ఆదివారం  రాత్రి 8.00గం.లకు శ్రీస్వామిఅమ్మవార్లకు తెప్పోత్సవం ఘనఘనంగా జరిగింది.

ఆలయ పుష్కరిణి వద్ద ఈ తెప్పోత్సవ కార్యక్రమం నిర్వహించారు. తెప్పోత్సవ కార్యక్రమంలో ముందుగా ఆలయ ప్రాంగణంలో శ్రీస్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులకు షోడశోపచారపూజలు జరిపారు. తరువాత ఉత్సవమూర్తులను ఆలయ రాజగోపురం నుండి పుష్పాలంకృత పల్లకీలో ఊరేగింపుగా తొడ్కోని వచ్చి పుష్కరిణిలో ఏర్పాటు చేసిన ప్రత్యేక తెప్పపై వేంచేబు చేయించి విశేష పూజాదికాలను జరిపారు.తరువాత మంగళవాయిద్యాల నడుమ వేదమంత్రాలతో ఎంతోశాస్త్రోక్తంగా ఈ తెప్పోత్సవం జరిపారు.

 వివిధ రకాల పుష్పాలతో చేసిన ప్రత్యేక అలంకరణతో, విద్యుత్ దీపాలంకరణతో  తెప్ప ఎంతో కళాత్మకంగా రూపొందింది. 

తెప్ప అలంకరణకు గాను ఎరుపుబంతి, పసుపు బంతి, తెల్లచేమంతి, ఆస్టర్, జబ్రా, గ్లాడియోలస్, ఆర్కిడ్స్, మొదలైన పుష్పాలను వినియోగించారు.తెప్పోత్సవాన్ని దర్శించుకోవడం వలన శ్రేయస్సు కలుగుతుంది. శత్రుబాధలు తొలగిపోతాయి. కోర్కెలు నెరవేరుతాయి. ముఖ్యంగా సకాలంలో తగినంత వర్షాలు కురిసి పంటలు బాగా పండుతాయి.

print

Post Comment

You May Have Missed