
రైతు సంక్షేమం, వ్యవసాయాభివృద్ధి పై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు చిత్తశుద్ధితో ఉన్నారని మండలిలో ప్రభుత్వ విప్,ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు గురువారం ప్రగతి భవన్ లో కేసీఆర్ ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. రైతులపై ఉన్న ప్రేమ తెలియజేసే విధంగా వాసు అనే చిత్ర కారుడు గీసిన చిత్రాన్ని సీఎం కేసీఆర్ కు బహుకరించారు. రైతు గుండెల్లో కేసీఆర్ ఉంటే కేసీఆర్ గుండెల్లో రైతు ఉన్నాడని భావోద్వేగ పూరిత అర్ధం స్పురించేలా ఉంది ఈ చిత్రం. రైతును కేసీఆర్ గుండెల్లో పదిలంగా పెట్టుకుని ఏ విధంగా కాపాడుకుంటున్నాడో, అదే విధంగా తన కోసం పనిచేసే రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి కేసీఆర్ ను అంతే పదిలంగా అంతే ప్రేమతో తెలంగాణ రైతన్న గుండెల్లో నిలుపుకున్నాడనే భావాన్ని, రైతుకు సీఎం కేసీఆర్ కు ఉన్న అనుబంధాన్ని ఈ చిత్రం తెలియజేస్తుంది.తన భావనను చిత్రకారుడి కి చెప్పి గీయించిన ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ను ఈ సందర్భంగా సిఎం కేసీఆర్ అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు బాల్క సుమన్ , జీవన్ రెడ్డి, చైర్మన్లు ఎస్ . వేణుగోపాలచారి, డాక్టర్ ఆంజనేయ గౌడ్ పాల్గొన్నారు.