అందరి సమిష్టి కృషివల్లనే ఉగాది ఉత్సవాలు విజయవంతం,అందరికి ధన్యవాదాలు -ఈ ఓ

శ్రీశైల దేవస్థానం:ఏప్రియల్ 6 నుంచి 10 వరకు ఉగాది మహోత్సవాలు ఘనంగా జరిగినందుకు ఈ ఓ అందరికి థాంక్స్ తెలిపారు.

ఈ ఉత్సవాలు విజయవంతంగా పూర్తవడాన్ని పురస్కరించుకుని గురువారం  ఉదయం కార్యనిర్వహణాధికారి ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. కార్యాలయ భవనములోని సమావేశ మందిరములో జరిగిన ఈ సమావేశంలో వైదిక కమిటీ సభ్యులు, డిప్యూటీ కార్యనిర్వహణాధికారిణి , అన్ని విభాగాల యూనిట్ అధికారులు, పర్యవేక్షకులు సంబంధిత సిబ్బంది పాల్గన్నారు.

ఈ సమావేశములో కార్యనిర్వహణాధికారి మాట్లాడుతూ దేవస్థానములోని అన్ని విభాగాల పనితీరును ప్రశంసిస్తూ సిబ్బంది అందరికీ పేరు పేరునా ధన్యవాదాలు తెలియజేశారు. ఉత్సవాలకంటే వారం – పది రోజుల ముందునుంచే భక్తులు క్షేత్రాన్ని చేరుకోవడం జరిగిందన్నారు. ముందస్తు ఏర్పాట్ల వలన భక్తులందరికీ సేవలు అందించగలిగామన్నారు.

అందరి సమిష్టి కృషివల్లనే ఉగాది ఉత్సవాలు విజయవంతంగా ముగిశాయన్నారు ఈ ఓ. అన్ని విభాగాల యూనిట్ అధికారులు, పర్యవేక్షకులు, ఆయా విభాగాల సిబ్బంది పరస్పర సమన్వయముతో విధులు నిర్వర్తించారన్నారు. ఉత్సవాల నిర్వహణకు అహర్నిశలు శ్రమించి ఉత్సవాల నిర్వహణకు సిబ్బంది అందరు తోడ్పాటును అందించారన్నారు.

ముఖ్యంగా జిల్లా కలెక్టర్ , జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ , జిల్లా జాయింట్ కలెక్టర్, జిల్లా అదనపు పోలీస్ సూపరింటెండెంట్ వారు ఉత్సవాల నిర్వహణకు ఎంతగానో దిశానిర్దేశం చేశారన్నారు. ఎప్పటికప్పుడు తగు సూచనలను చేస్తూ ఉత్సవాలు విజయవంతమవ్వడంలో ప్రముఖ పాత్ర పోషించారన్నారు.

అదేవిధంగా జిల్లా పోలీస్ శాఖ, వైద్య ఆరోగ్యశాఖ, అటవీశాఖ మొదలైన ప్రభుత్వశాఖలు ఉత్సవ నిర్వహణలో తమవంతు పాత్ర పోషించాయన్నారు. ఈ శాఖల సిబ్బంది ఉత్సవాల నిర్వహణలో ప్రశంసనీయపాత్రను పోషించారన్నారు.

తరువాత సమావేశంలో పలు విభాగాల అధికారులు ప్రసంగించారు.

అనంతరం దేవస్థానం సిబ్బంది కార్యనిర్వహణాధికారివారిని సత్కరించారు. అదేవిధంగా అర్చకస్వాములకు, వివిధ విభాగాల అధికారులకు, సిబ్బందికి కార్యనిర్వహణాధికారి శ్రీస్వామివారి శేషవస్త్రం, లడ్డు ప్రసాదాలను అందజేసి సత్కరించారు.

print

Post Comment

You May Have Missed