బదిలీ సిబ్బందికి ఆత్మీయ వీడ్కోలు

శ్రీశైల  దేవస్థానం:సాధారణ బదిలీలలో భాగంగా ఈ దేవస్థానం  నుంచి పలువురు ఉద్యోగులు ఇతర

దేవస్థానాలకు బదిలీ అయ్యారు.

ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్లు, సహాయ కార్యనిర్వహణాధికారులు, పర్యవేక్షకులు, సీనియర్‌
అసిస్టెంట్లు, జూనియర్‌ అసిస్టెంట్లు, ఇంజనీరింగ్‌ విభాగపు డ్రాఫ్లుమెన్‌ మొదలైన క్యాడర్లలోని
మొత్తం 21 మంది ఉద్యోగులు బదిలీ అయిన వారిలో ఉన్నారు.

మంగళవారం , బదిలీపై వెళ్తున్న సిబ్బందికి  వీడ్కోలుగా   పరిపాలనా భవనములో
సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశములో కార్యనిర్వహణాధికారి  డి. పెద్దిరాజు, డిప్యూటి కార్యనిర్వహణాధికారిణి
రమణమ్మ, పలు విభాగాల పర్యవేక్షకులు, సిబ్బంది పాల్గొన్నారు.

ఈ సందర్భముగా కార్యనిర్వహణాధికారి  డి. పెద్దిరాజు మాట్లాడుతూ బదిలీ అయిన సిబ్బంది
అందరూ భక్తుల సౌకర్యాల కల్పనలోను, దేవస్థానము అభివృద్ధిపరంగా, పాలనాపరంగా ఎంతో
సమర్ధవంతముగా విధులు నిర్వహించారన్నారు. అందరు ఉద్యోగుల సహకారం వల్లనే దేవస్థానం
అభివృద్ధికి వీలు కలుగుతుందన్నారు.

సమావేశములో ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు పి.వి. సుబ్బారెడ్డి,
పలువురు బదిలీ అయిన ఉద్యోగులు ప్రసంగించారు.సమావేశ చివరలో బదిలీ అయిన సిబ్బందికి శ్రీ స్వామివార్ల శేషవస్త్రం, ప్రసాదము అందించారు.

print

Post Comment

You May Have Missed