
శ్రీశైల దేవస్థానం:మల్లమ్మకన్నీరు వెనుకభాగం లో గుర్తు తెలియని వ్యక్తులు గుంతను త్రవ్వినట్లుగా సమాచారం రావడంతో ఈరోజు (02.07.2021)న దేవస్థానం అధికారులు ఆ ప్రదేశాన్ని పరిశీలించారు.వాస్తవానికి మల్లమ్మకన్నీరు వెనుకభాగంలో గల ప్రదేశం దేవస్థానం పరిధిలోనిది కాదు. ఆ ప్రదేశములో ఎలాంటి ప్రాచీన ఆలయంగానీ, మండపం గానీ లేదు.అయినప్పటికీ వాస్తవ పరిస్థితులను గుర్తించేందుకు గుంత త్రవ్విన ప్రదేశాన్ని పరిశీలించారు.ప్రస్తుతం ఒక కొట్టంలో ఈ గుంతను త వ్వినట్లుగా గుర్తించారు. గత కొన్ని సంవత్సరాల క్రితం వరకు ఈ కొట్టంలో ఒక నాటు వైద్యుడు నివాసమున్నట్లుగా కూడా స్థానికులు పేర్కొంటున్నారు.అదేవిధంగా చాలాకాలంగా ఈకొట్టంలో ఎవరు కూడా నివాసం ఉండటం లేదని స్థానికుల ద్వారా తెలుస్తోంది.
ఈ విషయాన్ని స్థానిక అటవీశాఖ అధికారులకు కూడా తెలుపుతామని దేవస్థానం పేర్కొంది.
ఈ పరిశీలనలో కార్యనిర్వహణాధికారి కే ఎస్.రామరావు తో పాటు రెండవ పట్టణ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ మల్లికార్జున, ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు మురళీ బాలకృష్ణ, ప్రచురణల విభాగం సంపాదకుడు డా. సి.అనిల్ కుమార్, పర్యవేక్షకులు ఎన్. శ్రీహరి, దేవస్థానం భద్రతా అధికారి నరసింహరెడ్డి, సహాయ స్థపతి ఎం. జవహర్ తదితర సిబ్బంది ఉన్నారు.