
శ్రీశైల దేవస్థానం: NXT డిజిటల్ నెట్ వర్క్ ద్వారా శ్రీశైల టీ.వి ప్రసారాలను ఈ రోజు నుంచి అందుబాటులోకి తెచ్చారు.
NXT డిజిటల్ నెట్ వర్క్ సంస్థ వైస్ ప్రెసిడెంట్ ఎస్.శ్రీకుమార్ ఈ ప్రసారాలను ఈరోజు సాయంత్రం కార్యనిర్వహణాధికారి కార్యాలయంలో సదరు నెట్ వర్క్ ద్వారా ప్రసారాలను ప్రారంభించారు.
ఇప్పటి వరకు శ్రీశైల టీ.వి ప్రసారాలు యూట్యూబ్ ద్వారా, మరియు ACT నెట్ వర్క్ ద్వారా నెల్లూరు, చిత్తూరు జిల్లాలలో మాత్రమే అందుబాటులో ఉండేవి.
అయితే ఇప్పటి నుంచి NXT డిజిటల్ నెట్ వర్క్ ద్వారా దేశవ్యాప్తంగా కూడా ఈ ప్రసారాలు సుమారు 50 లక్షల మంది వీక్షుకులకు అందుబాటులోకి వచ్చాయి.
NXT డిజిటల్ నెట్ వర్క్‌లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో ఛానల్ నెం.66 ద్వారా, దేశంలోని ఇతర ప్రాంతాలలో ఛానల్ నెం.752 ద్వారా శ్రీశైల టీ.వి ప్రసారాలను వీక్షించవచ్చు.