<
>
మంత్రి హరీష్రావు ఆధ్వర్యంలో ఇస్రో, తెలంగాణ ఇరిగేషన్ శాఖల మధ్య ఎంవోయూ కుదిరింది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తెలంగాణ జలవనరుల శాఖకు సమాచార వ్యవస్థను అందుబాటులోకి రానుంది. దీంతో జలాశయాల్లో నీటి నిల్వలను ఉపగ్రహంతో విశ్లేషించనున్నారు. నీటివనరుల సమాచార వ్యవస్థను కలిగివున్న తొలి రాష్ట్రంగా తెలంగాణ గుర్తింపు పొందింది. తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రయోగానికి నాంది పలికినట్టు ఇస్రో కితాబిచ్చింది.