తెలంగాణను ఒక ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతాం-ముఖ్యమంత్రి రేవంత్

ప్రజా భవన్‌లో 16 వ ఆర్థిక సంఘం చైర్మన్, సభ్యుల తో జరిగిన సమావేశానికి హాజరైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారులు కే. కేశవరావు, షబ్బీర్ అలీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఇతర ఉన్నతాధికారులు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగం అంశాలు:

  • దేశంలోనే తెలంగాణ యంగెస్ట్ స్టేట్.
  • మా రాష్ట్రాన్ని ది ఫ్యూచర్ స్టేట్ గా పిలుస్తున్నాం.
  • దేశంలోనే తెలంగాణ వేగంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం.
  • మన దేశాభివృద్ధి లో తెలంగాణ కీలక పాత్ర పోషిస్తుంది.
  • బలమైన పునాదులు, చక్కటి ఆర్థిక వ్యవస్థ ఉన్నప్పటికీ… ఆర్థికంగా తెలంగాణ అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది.
  • భారీ రుణ భారం తెలంగాణకు సవాల్ గా మారింది.
  • గత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి రుణ భారం రూ.85 లక్షల కోట్లకు చేరుకుంది. ఇందులో బడ్జెట్ రుణాల తో పాటు ఆఫ్-బడ్జెట్ రుణాలు ఉన్నాయి.
  • గత పదేళ్లలో ప్రభుత్వం భారీ గా అప్పులు తీసుకుంది. రాష్ట్ర ఆదాయంలో ఎక్కువ భాగం రుణాన్ని తిరిగి చెల్లించడానికే వెచ్చించాల్సిన పరిస్థితిని తీసుకొచ్చింది.
  • రుణాలు, వడ్డీ చెల్లింపులు ఇప్పుడు సక్రమంగా నిర్వహించకపోతే రాష్ట్ర పురోగతిపై ప్రభావం చూపే అవకాశం ఉంది.
  • ఈ నేపథ్యంలో రుణాల సమస్యను పరిష్కరించేందుకు మాకు తగిన సహాయం, మద్దతు ఇవ్వాలని కోరుతున్నాం.
  • రుణాన్ని రీ స్ట్రక్చర్ చేసే అవకాశం ఇవ్వండి.. లేదా మాకు అదనపు ఆర్ధిక సహాయాన్ని అందించండి.
  • కేంద్ర పన్ను ల్లో రాష్ట్రాలకు పంపిణీ చేసే నిధుల వాటాను 41% నుంచి 50%కి పెంచండి. అన్ని రాష్ట్రాల తరపున  ఈ డిమాండ్‌ను మీ ముందు ఉంచుతున్నాం.
  • ఈ డిమాండ్ ను మీరు నెరవేర్చితే.. దేశాన్ని 5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ గా మార్చాలని ప్రధాని నరేంద్ర మోదీ ఎంచుకున్న లక్ష్య సాధనకు  మేం సంపూర్ణంగా సహకారిస్తాం. తెలంగాణను మేం ఒక ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతాం.
  • తెలంగాణకు తగినంత సహాయం అందించండి. దేశాన్ని ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చడంలో మా వంతు బాధ్యతను నేరవేరుస్తాం.
  • ఫిస్కల్ ఫెడరలిజాన్ని బలోపేతం చేయడంలో మీ మద్దతు కోరుతున్నాం..
  • తెలంగాణ ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించేందుకు మీ సిఫారసులు ఉపయోగపడతాయని మేం నమ్ముతున్నాం.
print

By Online News Diary

ONLINENEWSDIARY.COM - A Multilingual Online News Portal

Leave a Reply

Your email address will not be published.