ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు రేపు (22 అక్టోబర్) మధ్యాహ్నం 2 గంటలకు వరంగల్ రూరల్ జిల్లా గీసుకొండ మండలం శాయంపేట హవేలి గ్రామ పరిధిలో కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్కుకు, వరంగల్ ఔటర్ రింగు రోడ్డు నిర్మాణానికి, కాజీపేట ఆరోఓబికు సమాంతర వంతెన నిర్మాణానికి, మడికొండ ఐటి ఇంక్యుబేటర్ సెంటర్ విస్తరణ పనులకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం జరిగే బహిరంగ సభలో సీఎం మాట్లాడతారు.