హైదరాబాద్, ఏప్రిల్ 30:: సీనియర్ IAS అధికారి కే. రామకృష్ణా రావు బుధవారం తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా అధికార బాధ్యతలు స్వీకరించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గా ఉన్న ఏ. శాంతి కుమారి IAS పదవి విరమణ పొందారు. ఆమె స్థానంలో 1991 బ్యాచ్ అధికారి కే. రామకృష్ణా రావు ను తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గా నియమిస్తూ ఏప్రిల్ 27వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో బుధవారం రామకృష్ణా రావు తెలంగాణ సచివాలంయంలో అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు.