ప్రభుత్వ ఆశయం సిద్ధించేలా అన్ని రకాల సేవలను సచివాలయాల్లోనే ప్రజలకు అందించాలి-కలెక్టర్ పి.కోటేశ్వర రావు
*ఈ రోజు (28-10-2021)న ఆత్మకూరు మండలం సుండిపెంట గ్రామ సచివాలయం – 2 ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వర రావు.*
★ ఆకస్మికంగా సుండిపెంట గ్రామ సచివాలయం తనిఖీ చేసిన కలెక్టర్ పి.కోటేశ్వర రావు.
★ సమస్యల పరిష్కారం కోసం వచ్చే ప్రజలను గౌరవించి, వారికి అర్ధమయ్యే రీతిలో తెలియచెప్పి త్వరితగతిన పరిష్కారానికి కృషి చేసి మన్ననలు పొందండి.
★ ప్రజా సమస్యలు/ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం లేకుండా ప్రభుత్వం నిర్దేశించిన గడువు లోపు పరిష్కరించాలి .
★ ప్రభుత్వ ఆశయం సిద్ధించేలా అన్ని రకాల సేవలను సచివాలయాల్లోనే ప్రజలకు అందించాలి.
★ జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకంపై అవగాహన కల్పించాలి.
★ గ్రామ సచివాలయం సిబ్బందిని ఆదేశించిన జిల్లా కలెక్టర్ .
కర్నూలు, అక్టోబర్ 28 :-సమస్యల పరిష్కారం కోసం వచ్చే ప్రజలను గౌరవించి వారికి అర్ధమయ్యేరీతిలో తెలియచెప్పి త్వరితగతిన పరిష్కారానికి కృషి చేసి మన్ననలు పొందాలని సచివాలయ సిబ్బందికి జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వర రావు సూచించారు.
గురువారం మధ్యాహ్నం ఆత్మకూరు మండలం సుండిపెంట గ్రామ సచివాలయం -2 ను జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వర రావు ఆకస్మికంగా తనిఖీ చేశారు.
సచివాలయంలో సిబ్బంది హాజరు పట్టిక, ఉద్యోగుల మూవ్మెంట్ రిజిస్టర్, సంక్షేమ పథకాల క్యాలెండర్, ఎస్ఎల్ఏ గడువులోగా ప్రజా సమస్యల పరిష్కార చర్యల నివేదిక, ప్రభుత్వ పథకాల పోస్టర్ లు తదితర వాటిని జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఇప్పటి వరకు సచివాలయానికి ఎన్ని సర్వీసులు వచ్చాయి, ఎన్ని సర్వీసులకు పరిష్కారం చూపించారు అనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. 18 సంవత్సరాల పైబడిన వారు ఎంత మంది ఉన్నారు, మొదటి డోస్ వ్యాక్సిన్ ఎంత మందికి పూర్తయింది, రెండో డోస్ ఎంతమంది వేయించుకున్నారు, ఇంకా అసలు వ్యాక్సిన్ వేయించుకొని వారు ఎంత మంది ఉన్నారు వంటి వివరాలను సచివాలయ సిబ్బందిని జిల్లా కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. వాలంటీర్లతో మాట్లాడి ప్రభుత్వ పథకాల అమలు తీరు తెలుసుకున్నారు. సచివాలయం డిజిటల్ అసిస్టెంట్ తమ గ్రామానికి సంబంధించిన డేటా మొత్తం కంప్యూటర్ లో నిక్షిప్తం చేయాలన్నారు.
ప్రజా సమస్యలు/ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం లేకుండా ప్రభుత్వం నిర్దేశించిన గడువు లోపు పరిష్కరించాలని సచివాలయం సిబ్బందికి జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ మెరుగైన, వేగవంతమైన సేవలందించాలని సచివాలయ సిబ్బందిని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ప్రభుత్వ ఆశయం సిద్ధించేలా అన్ని రకాల సేవలను సచివాలయాల్లోనే ప్రజలకు అందించాలని గ్రామ సచివాలయ సిబ్బందిని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులను ప్రభుత్వం విధించిన గడవులోగా పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలని అక్కడున్న సిబ్బందికి సూచించారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి మెరుగైన సేవలు అందిస్తూ సచివాలయ సేవలు గురించి ఇంటింటికి తెలియజేసి ప్రజల మన్ననలు పొందాలని సచివాలయ సిబ్బందికి జిల్లా కలెక్టర్ ఆదేశించారు. సమస్యలు తీర్చేలా సచివాలయాలు పని చేయాలని, ప్రజలకు అవసరమైన అన్ని రకాల సేవలను ఇంటి వద్దనే అందించేందుకు సచివాలయ వ్యవస్థ అనేది చాలా కీలకమన్నారు.
జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకంపై అవగాహన కల్పించాలి :-
ప్రభుత్వం అమలు చేస్తున్న జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకం పై లబ్దిదారులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించి, ఈ పథకాన్ని వినియోగించుకొనేలా చూడాలని జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వర రావు సచివాలయ సిబ్బందిని ఆదేశించారు. ఈ పథకంపై విస్తృతంగా ప్రచారాన్ని చేయాలని సచివాలయ సిబ్బందికి జిల్లా కలెక్టర్ సూచించారు.
Post Comment