శ్రీశైల దేవస్థానం:
*స్వచ్ఛ శ్రీశైలంలో భాగంగా పారిశుద్ధ్య స్వచ్ఛసేవా కార్యక్రమం
*క్షేత్ర పరిధిలోని పలు ప్రాంతాలలో విస్తృత పారిశుద్ధ్య చర్యలు
*పారిశుద్ధ్యం కోసం క్షేత్రాన్ని 6 జోన్లు, 11 సెక్టార్లు, 66 ప్రదేశాలుగా విభజన.
స్వచ్ఛ శ్రీశైలం నిర్వహణలో భాగంగా గురువారం క్షేత్ర పరిధిలో పారిశుద్ధ్య స్వచ్ఛసేవా కార్యక్రమం నిర్వహించారు.
తరువాత ప్రసాద విక్రయ కేంద్రాలు, ఆలయ మాడవీధులు, క్యూకాంప్లెక్సు, సాక్షిగణపతి ఆలయం, హాటకేశ్వరం, శిఖరేశ్వరం మొదలైన చోట్ల ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా కార్యనిర్వహణాధికారి మాట్లాడుతూ స్వచ్ఛశ్రీశైలం కార్యక్రమం లో భాగంగా ప్రతి గురువారం కూడా ఈ స్వచ్ఛసేవా కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు.
పారిశుద్ధ్య నిర్వహణకుగాను క్షేత్రాన్ని 6 జోన్లుగా, 11 సెక్టార్లుగా, 66 ప్రదేశాలుగా విభజించారు.
పారిశుద్ధ్య కార్యక్రమాన్ని పర్యవేక్షించేందుకు ప్రతి జోనుకు కూడా దేవస్థానం శాఖాధిపతులను, పర్యవేక్షకులను ప్రత్యేక అధికారులుగా నియమించారు. అదేవిధంగా ఆయా జోన్లలో పలువురు సిబ్బందికి ప్రత్యేక విధులు కేటాయించడం జరిగింది. దాదాపు అన్ని విభాగాల సిబ్బంది కూడా ఈ ప్రత్యేక విధులలో పాల్గొంటున్నారు.
ఈ కార్యక్రమం లో పలు ప్రధాన రహదారులు ఆలయ మాడవీధులు, గంగాధర మండపం నుంచి తూర్పువైపున నందిగుడి వరకు గల ప్రదేశం, దక్షిణం వైపున అలంకారేశ్వరాలయం ప్రదేశం, దర్శన క్యూకాంప్లెక్సు, విరాళాల సేకరణ కేంద్ర ప్రాంగణం, పరిసరాలు, అన్నప్రసాద వితరణ భవన పరిసరాలు, సి.ఆర్.ఓ కార్యాలయ పరిసరాలు, దేవస్థానం వైద్యశాల పరిసరాలు, గంగా గౌరీసదన్ పరిసరాలు, మల్లికార్జునసదన్ పరిసరాలు, గణేశసదన్ పరిసరాలు, టూరిస్ట్ బస్టాండ్ పరిసరాలు, సెంట్రల్ పార్కింగ్ ప్రదేశం, మల్లమ్మ కన్నీరు పరిసరాలు, పంచమఠాల పరిసరాలు, ప్రాథమిక ఆరోగ్యకేంద్ర పరిసరాలు,సర్వతోభద్రవన పరిసరాలు, కల్యాణకట్ట పరిసరాలు, ఆర్టీసి బస్టాండు, పాతాళగంగ మెట్లమార్గం, పాతాళగంగ స్నానఘట్టాలు, భ్రమరాంబా అతిథిగృహ పరిసరాలు, సాక్షిగణపతి ఆలయ పరిసరాలు, హాటకేశ్వరాలయ పరిసరాలు, శిఖరేశ్వర ఆలయ పరిసరాలు మొదలైన 60 చోట్లకు పైగా ఆయా ప్రదేశాలలో పారిశుద్ధ్య చర్యలు చేపట్టారు.