శ్రీశైల దేవస్థానం:స్వచ్ఛ శ్రీశైలంలో భాగంగా పారిశుద్ధ్య స్వచ్ఛసేవా కార్యక్రమం *
- స్వచ్ఛసేవా కార్యక్రమంలో భాగంగా అవగాహన ర్యాలీ*
- క్షేత్ర పరిధిలోని పలు ప్రాంతాలలో విస్తృత పారిశుద్ధ్య చర్యలు*
స్వచ్ఛ శ్రీశైలం నిర్వహణలో భాగంగా గురువారం క్షేత్ర పరిధిలో పారిశుద్ధ్య స్వచ్ఛసేవా కార్యక్రమం నిర్వహించారు.
ప్రతి గురువారం కూడా ఈ పారిశుద్ధ్య స్వచ్ఛసేవా కార్యక్రమం వుంటుంది.
ఘంటామఠ ప్రాంగణం, యాంఫీథియేటర్, టూరిస్ట్ బస్టాండ్, పాత ఫిల్టర్ బెడ్ ప్రాంగణం మొదలైనచోట్ల ఈ స్వచ్ఛసేవా కార్యక్రమం జరిగింది. చెదారాలతో పాటు పిచ్చిమొక్కలను కూడా తొలగించారు.
కాగా ఈ రోజు కార్యక్రమానికి ముందుగా గంగాధర మండపం నుంచి నందిగుడి వరకు అవగాహన ర్యాలీ జరిగింది.
ఈ సందర్భంగా కార్యనిర్వహణాధికారి మాట్లాడుతూ స్వచ్ఛశ్రీశైలం కార్యక్రమములో భాగంగా ప్రతి గురువారం కూడా ఈ స్వచ్ఛసేవా కార్యక్రమం నిర్వహించడం జరుగుతోందన్నారు. దేవస్థానం సిబ్బందితో పాటు శివసేవకులు కూడా ఈ సేవలో ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్నారన్నారు. క్షేత్రంలో పారిశుద్ధ్య నిర్వహణకు అందరు కూడా సహకరించాలన్నారు. స్థానికులందరు కూడా చెత్తాచెదారాలను నిర్దేశిత చెత్తబుట్టలలో మాత్రమే వేయాలన్నారు. అందరి సహాయ సహకారాల వలన క్షేత్రంలో పారిశుద్ధ్యాన్ని సమర్థవంతంగా నిర్వహించే వీలుకలుగుతుందన్నారు. క్షేత్రంలో పారిశుద్ధ్య నిర్వహణకు అందరు కూడా కృషి చేయాలన్నారు.
కాగా ఈ స్వచ్ఛసేవా కార్యక్రమానికి గాను దేవస్థాన శాఖాధిపతులను, అన్ని విభాగాల పర్యవేక్షకులను ప్రత్యేక అధికారులుగా నియమించారు. అదేవిధంగా పలువురు సిబ్బందికి ప్రత్యేక విధులు కేటాయించారు.
కార్యనిర్వహణాధికారి ఎం.శ్రీనివాసరావు, డిప్యూటీ కార్యనిర్వహణాధికారి ఎం. రమణమ్మ, ఎగ్జిక్యూటీవ్ ఇంజనీరు ఎం. నరసింహారెడ్డి, పలువురు సహాయకార్యనిర్వహణాధికారులు, పర్యవేక్షకులు, పలు విభాగాల సిబ్బంది, శివసేవకులు పాల్గొన్నారు.