
శ్రీశైల దేవస్థానం: శ్రీశైల దేవస్థానం లోని ప్రాచీన కట్టడాల పరిరక్షణలో భాగంగా ఆయా కట్టడాలను నిపుణుల బృందం సాంకేతిక అధ్యయనం చేసింది.జె.ఎన్.టి.యు (జవహర్ లాల్ నెహ్రు టెక్నాలజికల్ యూనివర్శిటీ) కాకినాడకు చెందిన ఇంజనీరింగ్ ప్రొఫెసర్లు డా. బి. కృష్ణారావు,, డా. ఎం. స్వరూపరాణి తదితర సిబ్బంది ఆలయం లోని గోపుర మండపాలు, ఇతర మండపాలు, రాతిస్తంభాలు మొదలైన వాటిని గత రెండు రోజులపాటు పరిశీలించారు.దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎస్. లవన్న, దేవస్థానం ఇంజనీరింగ్ అధికారులు నిపుణుల బృందానికి ఆలయం లోని ఆయా ప్రాచీన కట్టడాలను గురించి వివరించారు.
త్వరలో ఈ బృందం ప్రాచీన కట్టడాల పరిస్థితిపై అధ్యయన నివేదికను దేవస్థానానికి అందజేయనున్నది.ఈ నివేదికను అనుసరించి అవసరమైతే ఆయా మండప స్తంభాలు మొదలైనవాటికి శాస్త్రీయ విధానం లో మరమ్మతులు చేస్తారు.
పరిశీలనలో కార్యనిర్వహణాధికారివారితో పాటు ఎగ్జిక్యూటీవ్ ఇంజనీరు వి. రామకృష్ణ, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు ఎం. నరసింహారెడ్డి, సహాయ స్థపతి ఐ. ఉమావెంకట జవహర్ లాల్, సహాయ ఇంజనీరు సీతారమేష్, ముఖ్యభద్రతాధికారి నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.