శ్రీశైల దేవస్థానం:కర్ఫ్యూ వేళలలో చేసిన మార్పులను పురస్కరించుకుని ఆలయ దర్శన వేళలను మార్పు చేసారు.
రేపటి నుంచి (01.07.2021) ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 3.30 గంటల వరకు తిరిగి సాయంత్రం 6.00 గంటల నుంచి రాత్రి 8.00 గంటల వరకు భక్తులను దర్శనాలకు అనుమతిస్తారని దేవస్థానం ఈ ఓ కే ఎస్. రామరావు తెలిపారు. కార్యనిర్వహణాధికారి మాట్లాడుతూ దర్శనానికి వచ్చే భక్తులు కోవిడ్ నిబంధనలను పాటించాలన్నారు. అలాగే మాస్కును తప్పనిసరిగా ధరించాలన్నారు.అదేవిధంగా తరచుగా చేతులను శానిటైజేషన్ చేసుకోవడం, భౌతికదూరం పాటించడం లాంటివి విధిగా పాటించాలన్నారు.
మధ్యాహ్నం 3.30గంటల నుంచి సాయంత్రం 6.00 గంటల వరకు ఆలయశుద్ధి, శ్రీస్వామి అమ్మవార్లకు సాయంకాలపు పూజలు నిర్వహిస్తారు .
ప్రస్తుతం ఉదయం 6.00 గంటల నుంచి మధ్యాహ్నం 3.00 గంటల వరకు మాత్రమే దర్శనాలకు అనుమవుండగా
రేపటి నుంచి దర్శన సమయాన్ని మరో రెండున్నర గంటలపాటు పొడిగించారు. రాత్రి 9.00 గంటలకు ఆలయ ద్వారాలను మూసివేస్తారు.
స్వామి అమ్మవార్ల ఆలయ ద్వారాలు తెరచినప్పటి నుంచి రాత్రి ఆలయ ద్వారాలు మూసేంత వరకు రోజువారిగా జరిగే ఆలయ కైంకర్యాలన్నీ యథావిధిగా జరుపబడుతాయి. అర్చకస్వాములు ఈ కైంకర్యాలన్నింటిని ఏకాంతంగా నిర్వహిస్తారు.
అదేవిధంగా ఆన్లైన్ ద్వారా నిర్వహించే పరోక్షసేవలన్నీ కూడా యథావిధిగా కొనసాగుతాయి.