శ్రీశైల దేవస్థానం: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల నేపధ్యంలో ఫిబ్రవరి 22 నుండి మార్చి 4 వరకు 11 రోజుల పాటు
వసతి గదుల ముందస్తు రిజర్వేషన్ల సదుపాయం నిలిపివేశారు. కుటీర నిర్మాణ పథకం క్రింద కాటేజీలు, గదులు నిర్మించిన దాతలకు మాత్రం గతంలో మాదిరిగా ముందస్తు రిజర్వేషన్లకు అవకాశం ఉంది. దాతలు వసతి పొందేందుకు ఫిబ్రవరి 10వ తేదీలోగా దేవస్థానం కార్యాలయానికి లిఖిత పూర్వకంగా తెలపాలి. ఆ తరువాత వచ్చిన లేఖలను పరిగణలోనికి తీసుకునే అవకాశం లేదని దేవస్థానం వారు పేర్కొన్నారు.