హుండీల లెక్కింపు ద్వారా శ్రీశైల దేవస్థానానికి రూ. 2,79,34,370/-లు నగదు రాబడి-ఈ ఓ

 శ్రీశైల దేవస్థానం: బుధవారం  జరిగిన హుండీల లెక్కింపు ద్వారా  శ్రీశైల దేవస్థానానికి రూ. 2,79,34,370/-లు నగదు రాబడిగా లభించిందని దేవస్థానం ఈ ఓ  ఎస్.లవన్న తెలిపారు.ఈ హుండీ ఆదాయాన్ని భక్తులు గత 18 రోజులలో (05.03.2022 నుండి 22.03.2022 వరకు) సమర్పించారు.

ఈ నగదుతో పాటు 163 గ్రాముల 900 మిల్లీగ్రాముల బంగారు, 5 కేజీల 150 గ్రాముల వెండి లభించాయి.

 435 యు.ఎస్.ఏ డాలర్లు, 45 ఆస్ట్రేలియా డాలర్లు, 45 ఇంగ్లాండు ఫౌండ్స్, 40 యు.ఏ.ఈ దిర్హమ్స్, 20 కెనడా డాలర్లు, 5 ఓమన్ రియాల్స్ మొదలైన విదేశీ కరెన్సీ కూడా ఈ హుండీల లెక్కింపులో లభించాయి.

పటిష్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య సీసీ కెమెరాల నిఘాతో ఈ లెక్కింపును చేపట్టారు.

దేవస్థాన అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది, శివసేవకులుఈ హుండీ లెక్కింపులో పాల్గొన్నారు.

print

By Online News Diary

ONLINENEWSDIARY.COM - A Multilingual Online News Portal

Leave a Reply

Your email address will not be published.