×

పాదయాత్ర భక్తులకు సౌకర్యాల కల్పనపై  శ్రీశైల దేవస్థానం ఈ ఓ ఆదేశాలు

పాదయాత్ర భక్తులకు సౌకర్యాల కల్పనపై  శ్రీశైల దేవస్థానం ఈ ఓ ఆదేశాలు

*  G. Sudhakar Rao, Visakhapatnam donated Rs.1,00,116/- For Annadhaanam scheme.

*   K.V. Raghavendra Babu, Vijayawada donated  Rs.8,00,108/- For Annadhaanam scheme  in the Memory of his Father and Mother Late  K. Radha Gopala Krishna Rao , Late Smt K. Swarajya Lakshmi.

* T. Venkata Nagendra Hari Haranadh, Machilipatnam, Krishna District donated Rs.1,08,000/- For Annadhaanam scheme.

* శ్రీశైల దేవస్థానం: ఉగాది మహోత్సవాల సందర్భంగా క్షేత్రానికి వచ్చే  పాదయాత్ర భక్తులకు  సౌకర్యాల కల్పన కోసం  ఈ రోజు (27.03.2021) న  కార్యనిర్వహణాధికారి కే. ఎస్ .రామరావు  దేవస్థానం అన్ని విభాగాల యూనిట్ అధికారులు, పర్యవేక్షకులతో దూరశ్రవణ సమావేశం (టెలీకాన్ఫరెన్స్) నిర్వహించి పలు ఆదేశాలు జారీ చేశారు.

స్థానిక ఐ.టి.డి.ఎ. ప్రాజెక్ట్ అధికారి  రవీంద్రరెడ్డి, స్థానిక పోలీస్ సర్కిల్ ఇన్ స్పెక్టర్  బి. వెంకటరమణ, స్థానిక సబ్ ఇన్ స్పెక్టర్  హరిప్రసాద్ కూడా ఈ టెలికాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. ఈ సమావేశంలో ముందుగా, నిన్న  సకాలంలో   స్పందించి  పాదయాత్రతో  వస్తున్న భక్తబృందానికి భీమునికొలను దాటిన  తరువాత మంచినీటిని అందించి, వారిని సురక్షితంగా క్షేత్రానికి తోడ్కొని వచ్చిన స్థానిక సబ్ ఇన్ స్పెక్టర్ ను  కార్యనిర్వహణాధికారి  అభినందించారు. సాధారణంగా పాదయాత్ర భక్తులు హోళీ పౌర్ణమి రోజున వారి పాదయాత్రను ప్రారంభిస్తారని,కానీ ఈ సంవత్సరం ముందుస్తుగానే భక్తులు పాదయాత్రతో క్షేత్రానికి చేరుకోవడం విశేషమని  ఈ ఓ అన్నారు.ఈ కారణంగా కాలిబాట మార్గంలో ఆయా ఏర్పాట్లకు అవసరమైన అన్ని చర్యలను వెంటనే చేపట్టాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.  అటవీశాఖ అధికారులు ఏర్పాట్లలో భాగంగా కాలిబాట మార్గాన్ని పరిశీలిస్తున్నారని  చెబుతూ, దేవస్థాన ఇంజనీరింగ్ సిబ్బంది కూడా వారిని అనుసరించి అటవీశాఖ సహకారంతో ఆయా ఏర్పాట్లను చేపట్టాలని ఆదేశించారు.

ప్రతీ సంవత్సరం ఉత్సవాల ప్రారంభంకంటే నాలుగైదు రోజులు ముందుగా కైలాసద్వారం నుండి భీమునికొలను వరకు తాత్కాలిక పైపులైను ద్వారా మంచినీటి సరఫరా జరిగేదని అయితే ఈ సంవత్సరం వెంటనే పైపులైనులను వేసే పనులను ప్రారంభించాలన్నారు.

 భక్తులు సేదతీరేందుకు వీలుగా క్షేత్రపరిధిలో అవసరమైన చోట్ల చలువపందిర్లు ( పైపు పెండల్సును), వేసే పనులను కూడా వెంటనే ప్రారంభించాలని అన్నారు.మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో పాదయాత్రతో వచ్చే భక్తులకు ఆయా ప్రాంతాలలోని చెంచులు తమ పూర్తి సహాయ సహకారాలను అందించారని, అదేవిధంగా ప్రస్తుతం కూడా అక్కడి చెంచువారితో భక్తులకు సహాయ సహకారాలను అందింపజేయాలని ఐ.టి.డి.ఎ. ప్రాజెక్ట్ అధికారి వారిని కోరారు. ముఖ్యంగా భక్తులకు మంచినీటిని అందిచడంలో సహకారం అందించాలన్నారు.అందుకు ప్రాజెక్ట్ అధికారి  స్పందిస్తూ ఎన్.ఆర్ జి ఎస్. సిబ్బందిని వినియోగించి పాదయాత్ర భక్తులకు తగు ఏర్పాట్లు చేయడంలో సాయం ఉంటుందన్నారు.

 కాలిబాట మార్గంలోని వెంకటాపురం, నాగలూటి, పెద్ద చెరువు, కైలాసద్వారం మొదలైన చోట్ల అత్యవసర సమయంలో సంప్రదించవలసిన పోన్ నెంబర్లను తెలియపరుస్తూ ఫ్లెక్స్ బోర్డులను ఏర్పాటుచేయాలని శ్రీశైలప్రభ విభాగాన్ని ఈ ఓ  ఆదేశించారు.ఇందులో తప్పనిసరిగా దేవస్థాన కాల్ సెంటర్ ఫోన్ నెంబర్లను తెలియజేయాలన్నారు. భక్తులకు ఏమైనా ఇబ్బందులు ఎదురైతే వారు దేవస్థానానికి తెలియజేసే అవకాశం కలుగుతుందని దాంతో దేవస్థానం అవసరమైన చర్యలు వెంటనే చేపట్టవచ్చని అన్నారు.స్థానిక ఐ.టి.డి.ఎ. అటవీశాఖ, పోలీసు ,వైద్యశాఖల అధికారులతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ ఏర్పాట్లపై ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని అన్ని విభాగాలను ఆదేశించారు.

శాస్త్రోక్తంగా  కామదహనం:

ఈరోజు (27.03.2020)న  ఫాల్గుణ శుద్ధ చతుర్దశిని పురస్కరించుకుని సాయంకాలం 6.00 గం.లకు ఆలయ ముందుభాగంలోని గంగాధర మండపం వద్ద కామదహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముందుగా ఆలయంలో శ్రీ స్వామిఅమ్మవార్లకు ప్రత్యేక పూజలను జరిపారు. తరువాత శ్రీ స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులను ఆలయ ప్రాంగణంలో మనోహర గుండం ఎదురుగా వేంచేబు చేయించి విశేషపూజలను జరిపారు. అనంతరం ఉత్సవమూర్తులకు పల్లకీ సేవ  జరిగింది . ఈ పల్లకీసేవలోనే ఉత్సవమూర్తులు గంగాధర మండపం వరకు తోడ్కొని వచారు. ఆ తరువాత  పూజదికాలు జరిపించిన అనంతరం గడ్డితో చేసిన  మన్మధ రూపాన్ని దహనం చేసారు.అనంతరం ప్రసాదవితరణ కార్యక్రమం చేసారు.మన్మధుడు శివతపోభంగం చేయగా, కోపించిన పరమేశ్వరుడు మన్మథుడిని ఫాల్గుణ శుద్ధ చతుర్దశి రోజే దహించాడని పురాణాలు చెబుతున్నాయి. ఈ కారణంగానే కామదహనాన్ని నిర్వహించడం సాంప్రదాయమైనది. కామదహన కార్యక్రమాన్ని వీక్షించడం వల్ల  శివకటాక్షం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి.

 28న శ్రీశైల గిరిప్రదక్షిణ:ఫాల్గుణ పౌర్ణమిని పురస్కరించుకొని దేవస్థానం  (28.03.2021) సాయంత్రం  శ్రీశైల గిరిప్రదక్షిణ కార్యక్రమం సాంప్రదాయబద్ధంగా నిర్వహిస్తారు.

 సాయంత్రం శ్రీస్వామిఅమ్మవార్లకు  మహామంగళహారతుల అనంతరం శ్రీ స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను పల్లకీలో వేంచేబు చేయించి ప్రత్యేకపూజలు చేస్తారు . తరువాత శ్రీస్వామి అమ్మవార్ల పల్లకీ ఊరేగింపుతో శ్రీశైల గిరిప్రదక్షిణ ప్రారంభమవుతుంది.ఆలయ మహాద్వారం నుండి మొదలై ఈ ప్రదక్షిణ గంగాధరమండపం, అంకాళమ్మ ఆలయం, నందిమండపం, గంగాసదనం, బయలువీరభద్రస్వామి ఆలయం, అక్కడ నుండి వలయ రహదారి మీదుగా పంచమఠాలు, మల్లమ్మ కన్నీరు, పుష్కరిణి వద్దకు చేరుకుంటుంది. అక్కడి నుండి తిరిగి నందిమండపం వద్దకు చేరుకుంటుంది. నందిమండపం నుండి ఆలయ మహాద్వారం వద్దకు చేరుకోవడంతో ఈ గిరిప్రదక్షిణ ముగుస్తుంది.

 శ్రీశైలగిరిప్రదక్షిణ ఎంతో ప్రాశస్త్యం ఉన్నట్లు పురాణాలు చెబుతున్నాయి. త్రేతాయుగములో శ్రీరాముడు త్రిపురాంతకం, సిద్ధవటం, ఉమామహేశ్వరం, అలంపురం మొదలైన ద్వార క్షేత్రాలగుండా గిరిప్రదక్షిణ ఆచరించినట్లు శ్రీశైలఖండం చెబుతోంది.

శ్రీశైలక్షేత్రములోని ప్రాచీనమఠాలను, ఆలయాలను భక్తులచేత దర్శింపజేయిస్తూ వారిలో భక్తిభావాలను మరింతగా పెంపొందింపజేయాలని, అదేవిధంగా క్షేత్రాన్ని ఆధ్యాత్మికంగా తీర్చిదిద్దడంలో భాగంగా ఈ గిరిప్రదక్షిణను నిర్వహిస్తారు . 

గిరిప్రదక్షిణ అనంతరం భక్తులకు ప్రసాద వితరణ చేస్తారు.

print

Post Comment

You May Have Missed