
శ్రీశైల దేవస్థానం: ఫిబ్రవరి 22 నుండి నిర్వహిస్తున్న శ్రీశైల మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు శుక్రవారంతో ముగిసాయి.
ఈ రోజు ఉదయం శ్రీ స్వామి అమ్మవార్లకు విశేష పూజలను జరిగాయి.
అశ్వవాహన సేవ:
వాహనసేవలో భాగంగా ఈ రోజుసాయంకాలం శ్రీ స్వామి అమ్మవార్లకు అశ్వవాహనసేవ నిర్వహించారు.
ఈ సేవలో శ్రీ స్వామి అమ్మవారి ఉత్సవమూర్తులను అశ్వవాహనంపై వేంచేబు చేయించి ప్రత్యేక పూజాదికాలు చేసారు. తరువాత ఆలయ ప్రాంగణంలో ప్రాకారోత్సవం జరిగింది.
పుష్పోత్సవం – శయనోత్సవం:
ఈ రోజు సాయంకాలం శ్రీ స్వామి అమ్మవార్లకు పుష్పోత్సవంనిర్వహించారు. పుష్పోత్సవంలో శ్రీ స్వామి అమ్మవార్లను పసుపు చేమంతి, తెలుపు చేమంతి, నీలం చేమంతి నందివర్ధనం, గరుడవర్ధనం, ఎర్రగన్నేరు, తెల్లగన్నేరు, మందారం, ఎర్ర ఆస్టర్, నీలం ఆస్టర్, కాగడాలు, మల్లెలు, కనకాంబరాలు, ఎర్రగులాబిలు, పసుపు గులాబీలు, బహువర్ణ గులాబీ, ఊదా గులాబి మొదలుగా 21 రకాల పుష్పాలతో విశేషంగా ఆర్చించారు. తరువాత శ్రీస్వామి అమ్మవార్లకు ఏకాంత సేవను నిర్వహించి శయనోత్సవం జరిపారు.
*cultural events on Friday
* Bhakthi Ranjani 1st Programme At Nithyaradhana Stage (G.Narasimha Rao, Krishna District)
*Sampradaya Nruthyam 3rd Programme At Nithya kalradhana Stage (Smt.V.Janaki, Hyderabad)
*Sampradaya Nruthyam 2nd Programme At Nithyakalradhana Stage (Smt.M.Jamuna, Kavali)
*Shivalilalu 4th Programme At Nithya kalradhana Stage (Sri Mallikarjuna Natya Mandali, Dhornala)
*Donation of Rs.1,00,116/- For Annadanam & Rs.1,00,116/- For Gosamrakshana Nidhi By Y.V.H.S.Shastry,K.V.Rangareddy District, Telangana state.