ఈ నెల 20 నుంచి శ్రీశైల గిరిప్రదక్షిణ పున: ప్రారంభం

 శ్రీశైలదేవస్థానం:ఆశ్వయుజ శుద్ధ పౌర్ణమిని పురస్కరించుకొని ఈ నెల 20 వతేదీన శ్రీశైల గిరిప్రదక్షిణ కార్యక్రమం దేవస్థానం సాంప్రదాయబద్ధంగా నిర్వహిస్తోంది.

ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి సందర్భంగా గత మార్చి నెలలో ఈ గిరి ప్రదక్షిణ కార్యక్రమము నిర్వహించబడింది.

 కోవిడ్ కారణంగా ఈ గిరి ప్రదక్షిణ కార్యక్రమం  చైత్రమాసం  నుంచి (ఏప్రియల్ నుండి) నిలిపివేశారు. ప్రస్తుతం ఈ గిరిప్రదక్షిణ కార్యక్రమం  తిరిగి ప్రారంభమవుతోంది.

కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఈ కార్యక్రమం  నిర్వహించాలని నిర్ణయించారు.

 20వ తేదీ సాయంత్రం శ్రీస్వామి అమ్మవార్ల మహామంగళహారతుల అనంతరం శ్రీ స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను పల్లకీలో వేంచేబు చేయించి ప్రత్యేక పూజలుచేస్తారు. తరువాత శ్రీస్వామి అమ్మవార్ల పల్లకీ ఊరేగింపుతో శ్రీశైల గిరిప్రదక్షిణ ప్రారంభమవుతుంది.

ఆలయ మహాద్వారం నుండి మొదలై ఈ ప్రదక్షిణ గంగాధరమండపం, అంకాళమ్మ ఆలయం, నందిమండపం, గంగాసదనం, బయలువీరభద్రస్వామి ఆలయం, అక్కడ నుండి వలయ రహదారి మీదుగా పంచమఠాలు, మల్లమ్మ కన్నీరు, పుష్కరిణి వద్దకు చేరుకుంటుంది. అక్కడి నుండి తిరిగి నందిమండపం వద్దకు చేరుకుంటుంది. నందిమండపం నుండి ఆలయ మహాద్వారం వద్దకు చేరుకోవడంతో ఈ గిరిప్రదక్షిణ ముగుస్తుంది.

శ్రీశైలక్షేత్రములోని ప్రాచీనమఠాలను, ఆలయాలను భక్తులచేత దర్శింపజేయిస్తూ వారిలో భక్తిభావాలను మరింతగా పెంపొందింపజేయాలని, అదేవిధంగా క్షేత్రాన్ని ఆధ్యాత్మికంగా తీర్చిదిద్దడంలో భాగంగా ఈ గిరిప్రదక్షిణను నిర్వహిస్తారు.

ఇల కైలాసంగా ప్రసిద్ధమైన శ్రీశైల మహాక్షేత్రములో గిరిప్రదక్షిణ చేయడం ఎంతో ఫలప్రదం.

| దేవస్థానం ఆధ్వర్యంలోనే కార్యక్రమాలు:

ధర్మప్రచారంలో భాగంగా దేవస్థానం క్షేత్రపరిధిలో పలు ధార్మిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నది.

 ఏవైనా ఇతర ధార్మిక సంస్థలు లేదా భక్త బృందాల వారు  కార్యక్రమాలు నిర్వహించాలంటే దేవస్థానం అనుమతితో పాటు స్థానిక రెవెన్యూ,  పోలీస్ అధికారుల అనుమతి పొందడం కూడా తప్పనిసరి.

అదేవిధంగా దేవస్థానం భక్తుల సౌకర్యార్థం ఆలయములో పలు ఆర్జిత సేవలు నిర్వహిస్తోంది.

స్వామివారి గర్భాలయ అభిషేకం (రూ.5,000/-లు), సామూహిక అభిషేకాలు (రూ.1500), వృద్ధమల్లికార్జున స్వామివారి అభిషేకం (రూ.500/-), అంతరాలయములో అమ్మవారి కుంకుమార్చన ( రూ.1000/-) అమ్మవారి ఆలయ ప్రాకార మండపములో కుంకుమార్చన ( రూ.500/-) గణపతి హోమం ( రూ.1,116/-), రుద్రహోమం (రూ.1500/-) చండీహోమం (రూ.1500/-) మొదలైన ఆర్జిత సేవలు నిర్వహించబడుతన్నాయి.

ఈ సేవాటికెట్లను భక్తులు దేవస్థానం వెబ్ సైట్ www.srisalladevasthanam.org లేదా http: //aptemples.ap.gov.in నుంచి ముందస్తుగా పొందవచ్చును. ‘అదేవిధంగా కరెంట్ బుకింగ్ ద్వారా ఈ సేవాటికెట్లను అందిస్తారు. ఆయా సేవల నిర్వహణకు సంబంధించిన వివరాలను భక్తులు నేరుగా దేవస్థాన ప్రజాసంబంధాల అధికారి వారిని( 94403 42223) లేదా దేవస్థానం సమాచార కేంద్రం 83339 01351 /52 | 53/ 54/55/ 56 లను సంప్రదించవచ్చు.

 ధార్మిక కార్యక్రమాల నిర్వహణకుగాని లేదా ఆర్జిత సేవల నిర్వహణకుగాను ఎటువంటి మధ్యవర్తులను దేవస్థానం నియమించ లేదు.  ఈ విషయాన్ని భక్తులు గమనించగలరని  దేవస్థానం స్పష్టంచేసింది.

print

Post Comment

You May Have Missed