
శ్రీశైల దేవస్థానం: శ్రీశైల దేవస్థానం ధర్మకర్తల మండలి సమావేశం మంగళవారం జరిగింది. ధర్మకర్తల మండలి అధ్యక్షులు రెడ్డి వారి చక్రపాణిరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కార్యనిర్వహణాధికారి ఎస్. లవన్న, ధర్మకర్తల మండలి సభ్యులుమఠం విరూపాక్షయ్యస్వామి, శ్రీమతి జంగం సుజాతమ్మ. గురుమహాంత్ ఉమామహేష్, జి. నరసింహారెడ్డి, శ్రీమతి ఎం.వి. విజయలక్ష్మి శ్రీమతి బి. రామేశ్వరి, శ్రీమతి ఎ. లక్ష్మి సావిత్రమ్మ, మేరాజోత్ హనుమంతునాయక్, ఓ. మధుసూదన్ రెడ్డి, శ్రీమతి. డా. సి. కనకదుర్గ, ప్రత్యేక ఆహ్వానితులు తన్నీరు ధర్మరాజు పాల్గొన్నారు.
ఈ సమావేశంలో మొత్తం 48 అజెండా అంశాలు ప్రవేశపెట్టారు. వీటిలో 43 అంశాలు ఆమోదం పొందాయి. తక్కినవాటిలో 3 అంశాలు వాయిదా వేయగా, 2 అంశాలు తిరస్కరణ అయ్యాయి.
ముఖ్య నిర్ణయాలు :
- భక్తుల సౌకర్యార్థం నూతనంగా రూ.75 కోట్ల అంచనా వ్యయంతో క్యూ కాంప్లెక్స్ నిర్మించాలని నిర్ణయించారు. కమి షనర్, దేవదాయశాఖ నుండి పరిపాలనా, సాంకేతిక అనుమతులు వచ్చిన తదుపరి క్యూకాంప్లెక్స్ నిర్మాణానికి -టెండర్లు పిలుస్తారు.
భక్తుల సౌకర్యార్థం మల్లికార్జున సదన్ పై రూ.5,80,00,000ల అంచనా వ్యయంతో రెండో అంతస్తు నిర్మించాలని నిర్ణయించారు. కమిషనర్, దేవదాయ శాఖవారి నుండి పరిపాలనా , సాంకేతిక అనుమతులు వచ్చిన తదుపరి నిర్మాణానికి టెండరు పిలుస్తారు.
- ఇటీవల జరిగిన భూసర్వే ఆధారంగా గుర్తించిన దేవస్థానపు 7 చదరపు మైళ్ళ విస్తీర్ణములోని దేవస్థాన సరిహద్దు చుట్టూ రూ. 5,50,00,000లకు అంచనా వ్యయంతో ఫెన్షింగ్ వేయాలని నిర్ణయించారు. కమిషనర్, దేవదాయ శాఖ పరిపాలనా, సాంకేతిక అనుమతులు వచ్చిన తదుపరి నిర్మాణానికి టెండరు పిలుస్తారు.
- దోర్నాలలోని శ్రీశైల దేవస్థానం సత్రం వద్ద ఖాళీ ప్రదేశములో రూ.1,98,00,000 అంచనా వ్యయంతో కల్యాణ మండపం నిర్మించాలని నిర్ణయించారు. కమిషనర్, దేవదాయ శాఖ నుండి పరిపాలనా, సాంకేతిక అనుమతులు వచ్చిన తదుపరి నిర్మాణానికి టెండరు పిలుస్తారు.
- అదేవిధంగా దోర్నాల సత్రము వద్ద రూ.1,26,00,000ల అంచనా వ్యయంతో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించాలని నిర్ణయించారు. పరిపాలనా, సాంకేతిక అనుమతులు పొందిన తదుపరి నిర్మాణానికి టెండరు పిలుస్తారు.
దేవస్థానం ఇంజనీరింగ్ స్టోర్ వద్ద రూ.36,00,000లు ఫిలిగ్రిమ్ అమినిటీస్ సెంటర్ నిర్మించాలని నిర్ణయించారు. . పరిపాలనా, సాంకేతిక అనుమతులు పొందిన తదుపరి నిర్మాణానికి టెండరు పిలుస్తారు.
- గణేశసదనము ఎదురుగా పార్కింగ్ ప్రదేశం సమీపములో రూ.36,00,000లు ఫిలిగ్రిమ్ అమినిటీస్ సెంటర్ నిర్మించాలని నిర్ణయించారు. పరిపాలనా, సాంకేతిక అనుమతులు పొందిన తదుపరి నిర్మాణానికి టెండరు పిలుస్తారు.
- పాతాళగంగ వద్ద పితృ తీర్థ విధులు ( పితృకర్మలు) నిర్వహించుకునేందుకు వీలుగా ఏర్పాటుకు షెడ్డు నిర్మించాలని నిర్ణయించారు.
- వచ్చే వేసవికాలాన్ని దృష్టిలో ఉంచుకుని ఆలయ శివవీధులలో (మాడ వీధులలో) రూ.6,80,000ల అంచనా వ్యయంతో కూల్ పెయింటింగ్ పనులు చేపట్టడానికి నిర్ణయించారు.
శివసేవకుల సౌకర్యార్థం నంది కేశసదనంలో రూ.38,00,000ల అంచనా వ్యయంతో మరో డార్మిటరీ షెడ్డును నిర్మించాలని నిర్ణయించారు. పరిపాలనా, సాంకేతిక అనుమతులు పొందిన తదుపరి నిర్మాణానికి టెండరు పిలుస్తారు.
- వచ్చే మహాశివరాత్రి, ఉగాది ఉత్సవాలు, ఆఫీస్ నిర్వాహణ నిమిత్తం అవసరమైన కంప్యూటర్లు, ప్రింటర్లు, స్కానర్ల ఏర్పాటు, కొనుగోలుకు నిర్ణయించారు.
దేవస్థానం ఆగమ పాఠశాలకు రూ.8,00,000లతో తగు మరమ్మతులు చేయాలని నిర్ణయించారు.
- హిందూ ధర్మపరిరక్షణలో భాగంగా ప్రతీ సంవత్సరం కార్తిక మాసములో ఒకరోజున సాధువులకు వన భోజనాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
- నవంబరు నెల జమా ఖర్చులు పరిశీలించి ఆమోదించారు.