
శ్రీశైల దేవస్థానం:అలసత్వం లేకుండా సమర్థవంతంగా విధులు నిర్వహించాలని ఈ ఓ ఆదేశించారు.పాలనా సంబంధి త అంశాలపై కార్యనిర్వహణాధికారి ఎస్. లవన్న సోమవారం సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.కార్యాలయ భవనం లోని సమావేశ మందిరం లో జరిగిన సమీక్షలో అన్ని విభాగాల యూనిట్ అధికారులు, పర్యవేక్షకులు, సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు.స ఇటీవల శ్రీకాళహస్తి, కాణిపాకం, మహానంది, కసాపురం దేవస్థానాల నుంచి బదిలీపై వచ్చిన అధికారుల, ఇతర ఉద్యోగుల పరిచయ కార్యక్రమం జరిగింది.తరువాత కార్యనిర్వహణాధికారి మాట్లాడుతూ ఇతర ఆలయాల నుంచి వచ్చిన ఉద్యోగులందరు కూడా వారికి కేటాయించిన స్థానాలలో వెంటనే బాధ్యతలు చేపట్టాలన్నారు. వారి వారి విభాగాలకు సంబంధించి అవగాహనను కలిగించుకోవాలన్నారు. ముఖ్యంగా ఉద్యోగులందరు కూడా దేవస్థానము భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలు, వసతిసదుపాయం, దర్శనం ఏర్పాట్లు, అన్నప్రసాద వితరణ, ఆన్లైన్ సేవలు, పరోక్షసేవలు మొదలైనవాటిపైన కూడా అవగాహనను పెంపొందించుకోవాలన్నారు. ఎటువంటి అలసత్వం లేకుండా అందరు కూడా సమర్థవంతంగా వీధులు నిర్వహించాలన్నారు.
కార్యాలయ సమయపాలనను ఖచ్చితంగా పాటించాలన్నారు ఈ ఓ . కార్యాలయ వేళలలో ఉద్యోగులందరు కూడా వారి వారి స్థానాలలో అందుబాటులో ఉండాలన్నారు.కార్యాలయం లో మూమెంట్ రిజిష్టరును వెంటనే ఏర్పాటు చేయాలని పరిపాలనా విభాగాన్ని ఆదేశించారు. ఉద్యోగులు కార్యాలయ వేళలో విధినిర్వహణ నిమిత్తం కార్యాలయం నుంచి బయటకు వెళ్ళినప్పుడు సంబంధిత వివరాలను రిజిష్టరులో నమోదు చేయాలన్నారు.