శాస్త్ర రీతిన పుష్పోత్సవం – శయనోత్సవం, ముగిసిన శ్రీశైల మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు
శ్రీశైల దేవస్థానం: ఫిబ్రవరి 11 నుండి నిర్వహిస్తున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు మంగళవారంతో ముగిసాయి.
ఈ రోజు ఉదయం శ్రీ స్వామిఅమ్మవార్లకు విశేషపూజలను జరిపారు.అశ్వవాహన సేవ,ప్రాకారోత్సవం,పుష్పోత్సవం – శయనోత్సవం సంప్రదాయ కార్యక్రమాలతో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు మంగళవారం ఘనఘనంగా ముగిసాయి.
వాహనసేవలో భాగంగా సాయంకాలం శ్రీ స్వామిఅమ్మవార్లకు అశ్వవాహనసేవ జరిగింది.ఈ సేవలో శ్రీ స్వామిఅమ్మవారి ఉత్సవమూర్తులను అశ్వవాహనంపై వేంచేబు చేయించి ప్రత్యేక పూజాదికాలు చేసారు. తరువాత ఆలయ ప్రాంగణంలో ప్రాకారోత్సవం జరిపారు.
పుష్పోత్సవం – శయనోత్సవం:
ఈ రోజు సాయంకాలం శ్రీ స్వామిఅమ్మవార్లకు పుష్పోత్సవం జరిగింది. పుష్పోత్సవంలో శ్రీ స్వామిఅమ్మవార్లను పసుపు చేమంతి, తెలుపు చేమంతి, నీలం చేమంతి నందివర్థనం, గరుడవర్ధనం, ఎర్రగన్నేరు, తెల్లగన్నేరు, మందారం, ఎర్ర ఆస్టర్, నీలం ఆస్టర్, కాగడాలు, మల్లెలు, కనకాంబరాలు, ఎర్రగులాబీలు, పసుపు గులాబీలు, బహువర్ణ గులాబీ, ఊదా గులాబి మొదలుగా 21 రకాల పుష్పాలతో విశేషంగా ఆర్చించారు. తరువాత శ్రీస్వామిఅమ్మవార్లకు ఏకాంతసేవను నిర్వహించి శయనోత్సవం ఏర్పాటు చేసారు.
Post Comment